Wednesday, February 4, 2026 02:48 PM
Wednesday, February 4, 2026 02:48 PM

ఆ బ్యాచ్ ను సావు దెబ్బ కొట్టిన రో – కో

అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెరీర్ ముగిసిపోయింది అంటూ ఓ వర్గం గత రెండేళ్లుగా ప్రచారం చేస్తూనే ఉంది. ఇద్దరు ఫామ్ లో ఉన్నా సరే.. యువ ఆటగాడు శుభమన్ గిల్ కోసం సోషల్ మీడియా వేదికగా ఓ వర్గం పదేపదే వీళ్ళిద్దరిపై నెగిటివ్ ప్రచారం చేస్తూనే ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు రెండు దశాబ్దాల నుంచి అలరిస్తున్న ఈ ఇద్దరు ఆటగాళ్లు.. ఈ ఏడాది టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా పర్యటన తర్వాత వన్డే క్రికెట్ నుంచి కూడా తప్పుకునే అవకాశం ఉంది అనే ప్రచారం గట్టిగా జరిగింది. అటు సెలెక్టర్లు, హెడ్ కోచ్ గంభీర్ కూడా వీళ్ళిద్దరి విషయంలో ఇలాగే వ్యవహరించారు.

Also Read : రైతులతో గ్యాప్ ఉంది.. చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వీళ్ళిద్దరూ భవిష్యత్తులో ఆడాలి అంటే దేశవాళి క్రికెట్ ఆడాల్సిందే అనే కండిషన్లు కూడా పెట్టే ప్రయత్నం జరిగింది. కానీ ఆస్ట్రేలియా పర్యటన తర్వాత నుంచి వీళ్ళిద్దరి విషయంలో టీమిండియా యాజమాన్యం పెద్దగా జోక్యం చేసుకునే అవకాశం రావడం లేదు. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ముందు రెండు మ్యాచ్ లలో డక్ ఔట్ అయినా సరే మూడో మ్యాచ్లో మంచి ప్రదర్శన చేశాడు. ఆ సిరీస్ లో రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది సీరిస్ గా నిలిచాడు. ఇక సౌత్ ఆఫ్రికా తో తాజాగా జరిగిన తొలి వన్డేలో ఇద్దరూ అద్భుతమైన ప్రదర్శన చేశారు. రోహిత్ శర్మ అర్థ సెంచరీ తో ఆకట్టుకోగా.. విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు.

Also Read : ట్రాఫిక్ కష్టాలకు జీహెచ్ఎంసీ ప్లాన్ అదుర్స్

సాధారణంగా స్లోగా ఆడే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో మాత్రం దూకుడుగా ఆడాడు. ఇక కోహ్లీ సెంచరీ చేసుకున్న తర్వాత సెలబ్రేషన్ ఓ హైలెట్. 2014 నుంచి 2019 వరకు కోహ్లీలో అభిమానులు ఏదైతే చూసారో.. నిన్న మళ్ళీ అదే కనబడింది. ఫీల్డ్ లో కూడా చాలా యాక్టివ్ గా కనిపించాడు విరాట్ కోహ్లీ. దీంతో వీళ్ళిద్దరి విషయంలో టీమిండియా యాజమాన్యం ఇప్పట్లో జోక్యం చేసుకునే అవకాశం లేకపోవచ్చు. సౌత్ ఆఫ్రికా సిరీస్ తర్వాత వీళ్ళిద్దరి కెరీర్ పై బీసీసీఐ సమావేశ నిర్వహించే అవకాశం ఉంది అనే ప్రచారం ఈ మధ్యకాలంలో జరిగింది. తాజా ప్రదర్శన తర్వాత ఈ సమావేశం లేనట్లుగానే క్లారిటీ వస్తుంది. ఫిట్నెస్ పరంగా కూడా ఇద్దరూ యువ ఆటగాళ్ల కంటే మెరుగ్గా ఉన్నారు. ప్రదర్శన పరంగా కూడా సమస్యలు లేకపోవడంతో 2027 ప్రపంచకప్ వరకు వీళ్ళిద్దరి కెరీర్ డోకా లేదని క్లారిటీ వస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్