Wednesday, February 4, 2026 11:29 PM
Wednesday, February 4, 2026 11:29 PM

రోహిత్ దూకుడు వెనుక వ్యూహం ఇదేనా..?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చినట్టేనా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. సాధారణంగా ఐసిసి టోర్నీలు అనగానే రోహిత్ శర్మలో పూనకాలు వస్తాయి. అయితే గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. దీనితో రోహిత్ శర్మ ఎంతవరకు ఛాంపియన్స్ ట్రోఫీలో రాణిస్తాడు అనేదానిపై అభిమానుల్లో భయాలు ఉన్నాయి. 2023 వన్డే ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ ఆట తీరు చూసినవాళ్లు.. అలాగే 2024లో జరిగిన టి20 ప్రపంచ కప్ లో అతని దూకుడు చూసిన వాళ్లు ఛాంపియన్ ట్రోఫీలో కూడా అతను రాణిస్తాడు అని ధీమాగా ఉన్నారు.

Also Read : వంశీ కి ఊహించని షాక్ ఇచ్చిన హైకోర్టు

ఇక వారి అంచనాలకు తగ్గట్టు రోహిత్ శర్మ తిరిగి ఫామ్ లోకి వచ్చిన సంకేతాలే కనపడుతున్నాయి. ఇంగ్లాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ సెంచరీ తో చెలరేగిపోయాడు. ఇక తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన గ్రూప్ మ్యాచ్లో రోహిత్ శర్మ 41 పరుగులతో అలరించాడు. క్రీజ్ లో ఉన్నంత సేపు భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 7 ఫోర్ లతో మునుపటి రోహిత్ శర్మను చూపించాడు అభిమానులకు. సాధారణంగా ఐసీసీ టోర్నీలో రోహిత్ శర్మ ఓపెనర్ గా వచ్చి పవర్ ప్లే లో వీలైనంత ఎక్కువ పరుగులు చేస్తూ ఉంటాడు.

Also Read : కేసుల భయమా..? నియోజకవర్గంలో చిచ్చా..?

ప్రస్తుతం రోహిత్ శర్మ ఆట తీరు చూస్తుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో అది కొనసాగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మిగిలిన ఆటగాళ్లకు కాన్ఫిడెన్స్ ఇచ్చే రేంజ్ లో రోహిత్ శర్మ దూకుడు ఉంటుంది. 2023 ప్రపంచ కప్ లో జరిగింది ఇదే. ఇప్పుడు రోహిత్ తిరిగి ఫామ్ లోకి రావడంతో పక్కాగా అతను ఛాంపియన్స్ ట్రోఫీలో దుమ్మురేపడం ఖాయం అని అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. ఇక ఆదివారం జరగనున్న పాకిస్తాన్ తో మ్యాచ్ లో అతను ఏ విధంగా రాణిస్తాడు అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్