Thursday, February 5, 2026 04:39 AM
Thursday, February 5, 2026 04:39 AM

ఓపెనర్ గా రోహిత్.. నితీష్ కు షాక్…!

గురువారం నుంచి జరగబోతున్న నాలుగో టెస్ట్ లో భారత జట్టు ఎటువంటి వ్యూహంతో బరిలోకి దిగబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. నాలుగో టెస్ట్ అత్యంత కీలకంగా కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఏ నిర్ణయాలు తీసుకుంటాడు అనేదానిపై అటు జట్టు సభ్యులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తుది జట్టులో ఎవరికి చోటు కల్పిస్తారో అనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read : కూటమి నేతలకు ఎగ్జాం టైం.. 20 రోజుల్లో పాస్ అవ్వాలి…!

ఈ నేపథ్యంలో స్పిన్ ఆల్రౌండర్ను తుది జట్టులోకి తీసుకోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మ సుముఖంగా ఉన్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం రవీంద్ర జడేజా తో పాటుగా వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డిని నాలుగో టెస్ట్ కి పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నాడట కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక తాను ఓపెనింగ్ వచ్చి కేఎల్ రాహుల్ మూడో స్థానంలో పంపే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మిడిల్ ఆర్డర్లో తడబడుతున్న రోహిత్ శర్మ ఓపెనింగ్ లోనే రావాలని భావిస్తున్నాడట.

Also Read : ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ఖరారైతే తిరుగులేదు

దీనికి కేఎల్ రాహుల్ కూడా అంగీకారం తెలిపినట్టు సమాచారం. అయితే మిడిల్ ఆర్డర్లో గిల్ ను పంపాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు గిల్. బ్యాటింగ్ తో పాటుగా బౌలింగ్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుంటుంది జట్టు యాజమాన్యం. తొలి మూడు టెస్టుల్లో దారుణంగా నిరాశపరిచిన సీనియర్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ను పక్కన పెట్టే ఆలోచనలో జట్టు యాజమాన్యం ఉంది. అతని స్థానంలో యువ బౌలర్ హర్షిత్ రాణాను తీసుకోనున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్