భారత స్టార్ క్రికెటర్, కెప్టెన్ రోహిత్ శర్మ.. గత కొన్నాళ్ళుగా ఫాంలో లేక ఇబ్బందులు పడుతున్నాడు. అతని సామర్ధ్యానికి తగిన ఆట తీరు లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్ లో కూడా రోహిత్ పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. దీనితో రోహిత్ ఆట తీరు ప్రభావం జట్టు విజయావకాశాలపై కూడా పడుతోంది. ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సీరీస్ లో, ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ పర్వాలేదు అనిపించాడు. ఇప్పుడు మళ్ళీ ఫాం కోల్పోయి తంటాలు పడుతున్నాడు.
Also Read : బీసిసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టు ఇదే
ఈ తరుణంలో రోహిత్.. స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. తన రేంజ్ కు తగ్గ ఆట తీరుతో అభిమానులను మైమరిపిస్తున్నాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతూ.. దుమ్ము రేపుతున్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో, తాజాగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కూడా రోహిత్ ప్రభావం చూపించాడు. తాజాగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై భారీ విజయం సాధించింది. ఆ జట్టు పేసర్ బౌల్ట్ 4/26 స్పెల్ తో దుమ్ము రేపడంతో ఏ దశలో కూడా హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ కోలుకోలేదు.
Also Read : ఇంగ్లాండ్ టూర్ కు వెళ్తాడా..?
ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. దూకుడుగానే మ్యాచ్ ను ముగించింది. రోహిత్ శర్మ 46 బంతుల్లో 70 పరుగులు చేయడంతో.. హైదరాబాద్ ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. రోహిత్ ఫాం ఇలాగే కొనసాగితే మాత్రం ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సీరీస్ లో భారత్ కు ఖచ్చితంగా కలిసి వచ్చే అంశమే. ఆస్ట్రేలియాలో రోహిత్ విఫలం కావడం జట్టు విజయంపై ప్రభావం పడింది అనే చెప్పాలి. అయితే.. ఇంగ్లాండ్ టూర్ కు రోహిత్ శర్మ తప్పుకుంటున్నాడు అనే వార్తలు సైతం వచ్చాయి.

