కాన్పూర్ టెస్ట్ లో భారత్ పట్టు బిగిస్తోంది. రెండు రోజుల పాటు ఆట వర్షం కారణంగా రద్దు కావడం, ఈ మ్యాచ్ ఫలితం భారత్ కు కీలకం కావడంతో నాలుగవ రోజు దూకుడుగా బ్యాటింగ్ చేసింది. బంగ్లాదేశ్ ను తక్కువ పరుగులకే ఆల్ అవుట్ చేసిన భారత్… అనంతరం బ్యాటింగ్ ప్రారంభించి వేగంగా ఆడింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ పలు రికార్డులను కొల్లగొట్టింది. సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో 4వ రోజు ఆటలో భాగంగా… అత్యంత వేగంగా 27000 అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడిగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన కెరీర్‌లో మరో రికార్డు నమోదు చేసాడు.
కేవలం 594 ఇన్నింగ్స్ ల్లో ఈ ఫీట్‌ను సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ 623 ఇన్నింగ్స్ లు తీసుకుంటే కోహ్లీ 600 కంటే తక్కువ ఇన్నింగ్స్ లలో ఈ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఇతర ఆటగాళ్లు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర తర్వాతి స్థానాల్లో ఉన్నారు. జైస్వాల్ (52 బంతుల్లో 71), రాహుల్ (43 బంతుల్లో 68) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 52 పరుగుల ఆధిక్యంలో 9 వికెట్లకు 285 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
Read Also : లడ్డూ వ్యవహారంలో బాబు సర్కార్ కి సుప్రీంలో భంగపాటు
విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 50, 100, 150, 200 మరియు 250 పరుగులను నమోదు చేసిన జట్టుగా భారత్ రికార్డ్ సృష్టించింది. కేవలం 3 ఓవర్లలో ఓపెనింగ్ జోడి 50 పరుగులు చేసారు. ఇక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా 300 టెస్టు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.