వైసీపీ ఓటమికి ప్రధాన కారణం.. ఆ పార్టీ నేతల నోటి దూల. మంత్రుల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ తమ నోటికి ఎంత మాట పడితే అంత అనేశారు. కొన్ని సందర్భాల్లో స్థాయి మరిచి మరీ బరితెగించారు. అసభ్య పదజాలం, అసహ్యకరమైన సైగలు, బూతులు, దాడులు, హత్యలు.. ఇవే ఐదేళ్ల వైసీపీ పాలన. మేము అధికారంలో ఉన్నాం.. ఏమైనా చేస్తాం.. మాదే పెత్తనం.. అంతా మా ఇష్టం.. అని నిసిగ్గుగా వ్యవహరించారు. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఆర్కే రోజా, సీదిరి అప్పల్రాజు, అంబటి రాంబాబు.. ఇలా ఒకరేమిటి.. దాదాపు ప్రతి ఒక్కరూ నాడు బూతులతో రెచ్చిపోయిన వారే. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై దాడికి కూడా తెగబడ్డారు. మాజీ ముఖ్యమంత్రి అనే కనీస మర్యాద లేకుండా వ్యక్తిత్వ హననం చేశారు. చివరికి కుటుంబ సభ్యులపై కూడా సభలోనే తప్పుడు కూతలు కూశారు.
Also Read :సుప్రీం చీఫ్ జస్టీస్ సంచలన కామెంట్స్
నేతల నోటి దూల కారణంగానే వైసీపీ 151 నుంచి 11 స్థానాలకు పడిపోయిందనేది వాస్తవం. అయినా సరే ఇప్పటికీ ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. చింత చచ్చినా పులుపు చావలేదనే కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇందుకు కొంత మంది నేతల తీరును ఉదాహరణగా చూపిస్తున్నారు. అలాంటి వారిలో అగ్రస్థానంలో ఉన్నారు ఆర్కే రోజా. రెండేళ్ల పాటు మంత్రిగా వ్యవహరించిన రోజా.. ఇప్పటికీ తన తీరును మార్చుకోలేదు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి ఎన్నికల్లో ఓడిన తర్వాత రోజా సైలెంట్ అయిపోయారు. ఒకదశలో తమిళనాడులో కొత్తగా ప్రారంభమైన విజయ్ పార్టీలో చేరేందుకు కూడా ప్లాన్ చేశారు. అయితే అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో సైలెంట్‌గా నగరి వచ్చేశారు రోజా.
Also Read :లోకేష్ ప్లీజ్.. జూబ్లిహిల్స్ లో దూరంగా ఉండండి..?
నగరి నియోజకవర్గంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ వేదికపైన రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు కానీ.. గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు ఎమ్మెల్యేలు.. మరోసారి నోరు పారేసుకున్నారు రోజా. ఈ వ్యాఖ్యలు ప్రస్తుత నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ను ఉద్దేశించి చేసినవే. అయితే మొత్తం ఎమ్మెల్యేలందరినీ ఇలా అసభ్యంగా మాట్లాడటం ఎంత వరకు మర్యాద అనేది మంత్రిగా వ్యవహరించిన రోజాకు తెలియాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో కూటమి 164 గెలుపు వెనుక ఈవీఎం ట్యాంపరింగ్ ఉంది అనేది వైసీపీ నేతల ప్రధాన ఆరోపణ. మరి ఇదే సమయంలో వైసీపీ 151 స్థానాల్లో గెలుపు వెనుక కూడా అదే ఈవీఎం ఉందా అనేది టీడీపీ నేతల ప్రశ్న. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు గాలిలో గెలిస్తే.. మరి 2019లో రోజా గెలుపు కూడా గాలి వాటమేనా అని ఎద్దేవా చేస్తున్నారు. వరుసగా పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న రోజా.. నగరి నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని నిలదీస్తున్నారు.
Also Read :అప్పుడు లేని నొప్పి ఇప్పుడు ఎందుకు..? మస్క్ పై ట్రంప్ సీరియస్
రోజా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. తిరుమల గోశాలలో దారుణం జరుగుతోందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. గోశాలను సందర్శించేందుకు యత్నించిన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఆ సమయంలో కూడా రోజా ఆడంగి వెధవలు అంటూ మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఎయిర్ పోర్టులో పవన్ కల్యాణ్ అభిమానులకు మిడిల్ ఫింగర్ చూపించి.. వెకిలి చేష్టలు చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ అభిమానులు.. ఆమె కారుపై దాడి చేశారు కూడా. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా రోజా పదే పదే పవన్ పైన, లోకేష్ పైన నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. దీంతో రోజా ఘోరంగా ఓడిపోయారు. అయినా సరే.. ఇప్పటికీ అదే తరహాలో వ్యాఖ్యలు చేయడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి రోజా పైన టీడీపీ నేతలు, కార్యకర్తలు తొలి నుంచి గుర్రుగా ఉన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజా అరెస్టు ఖాయమని అంతా భావించారు. ఇక ఆడుదాం ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేశారని ఏసీబీ కేసు కూడా నమోదైంది. ఈ కేసులో రోజా అరెస్టు ఖాయమనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ కేసు విచారణ ముందుకు సాగటం లేదు. రోజాను ఓ మంత్రి కాపాడుతున్నారని.. అందుకే రోజా ఇలా రెచ్చిపోతున్నారని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. అధినేత కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాను మంత్రి ఎందుకు కాపాడుతున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.