తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో చేస్తున్న వ్యాఖ్యలు కాస్త సంచలనం అవుతున్నాయి. పరిపాలన సంగతి పక్కన పెడితే ఆయన కొన్ని విషయాల్లో కాస్త దూకుడుగా మాట్లాడుతున్నారు అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. సాధారణంగా రాజకీయ ప్రత్యర్థులపై రేవంత్ రెడ్డి చేసే వ్యాఖ్యలకు మీడియాలో మంచి హడావుడి ఉంటుంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్గా ఆయన చేసే వ్యాఖ్యలు వైరల్ అవుతూనే ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇదే తరహాలో మాట్లాడటం కంటిన్యూ చేస్తున్నారు.
Also Read : భవిష్యత్తుపై కేటిఆర్ సంచలన ప్రకటన
అంతవరకు బాగానే ఉన్నా తాజాగా తిరుమల లేఖల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దేశవ్యాప్తంగా తిరుమలకు భక్తులు క్యూ కడుతూ ఉంటారు. తెలంగాణ నుంచి కూడా భారీగా భక్తులు వస్తూ ఉంటారు. ఎప్పటినుంచో అక్కడి ప్రజాప్రతినిధులు తమ లేఖలకు కూడా టీటీడీలో దర్శనం కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. 2024 లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు సర్కార్ కొన్నాళ్లపాటు దీనిపై ఆచితూచి వ్యవహరించింది. ఈ సమయంలో పలువురు ఎమ్మెల్యేలు స్వయంగా చంద్రబాబు నాయుడు ని కలిసి లేఖల విషయంలో కాస్త ఆలోచించాలని కోరుతూ వచ్చారు.
Also Read : ఆ క్రెడిట్ చంద్రబాబుదే.. పవన్ కు చంద్రబాబు థాంక్స్..!
తెలంగాణ ఎమ్మెల్యేల విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చే లేఖలకు కూడా దర్శనాలు ఏర్పాటు చేసింది. ఈ విషయంలో అన్ని పార్టీల కార్యకర్తలు అన్ని పార్టీల అభిమానులు వర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వాన్ని, టిటిడిని పొగుడుతూ పోస్టులు కూడా పెట్టారు. అలాంటిది లేఖల విషయంలో రేవంత్ రెడ్డి అవమానించే విధంగా మాట్లాడటాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా టిడిపి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నేతల కోసం గట్టిగానే కష్టపడ్డారు. చాలామంది టిడిపి నేతలు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సన్నిహితంగానే ఉంటూ ఉంటారు. అలాంటిది లేఖల విషయంలో అడుక్కోవడం ఏంటి అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తేనె తుత్తుని కదిపినట్టే ఉన్నాయి అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.

