Tuesday, October 28, 2025 06:58 AM
Tuesday, October 28, 2025 06:58 AM
roots

అతి త్వరలో పవన్ తో భేటీ కానున్న రేణుదేశాయ్?

సోషల్ మీడియాలో కొందరి గురించి ఏ వార్త వచ్చినా ప్రజలకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందులో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదోక వార్తలు వస్తూనే ఉంటాయి. రేణు దేశాయ్ ఇప్పుడు కాస్త ఆధ్యాత్మికత వైపుగా వెళ్తున్నారు. మరోవైపు పిల్లల భవిష్యత్తు మీద కూడా ఆమె దృష్టి పెట్టి పలు జాగ్రత్తలు చూసుకుంటున్నారు. అకీరా నందన్ ను ఎలా అయినా హీరోని చేయాలని ఆమె కాస్త పట్టుధలగానే వ్యవహరిస్తున్నారు.

ఇక ఇప్పుడు ఆమె ఒక యూనివర్సిటీ మీద దృష్టి పెట్టారని తెలుస్తుంది. తాను చీఫ్ అడ్వైజర్ గా ఉన్న భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే మొదటిసారి నెలకొల్పనున్న గీత యూనివర్సిటీ మీద ఆమె దృష్టి పెట్టారు. పర్యావరణం, వన్య ప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై ఇప్పుడు ఆమె తెలంగాణా దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణుదేశాయ్‌ ని మంత్రి కొండా సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని మంత్రి సురేఖ.. రేణు దేశాయ్‌కి తన స్వహస్తాలతో అలంకరించారు.

రేణు దేశాయ్ విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో విడాకుల అనంతరం తన ఇద్దరి పిల్లరి బాగోగులు చూసుకుంటూ.. సోషల్ సర్వీస్‌పై ఆమె దృష్టి పెట్టారు. రైతుల గురించి, ఇంకా యానిమల్స్, చిన్నపిల్లల ఫుడ్ కోసం ఆమె కొంత అమౌంట్ డొనేట్ చేస్తూనే.. సోషల్ మీడియా ఫాలోయర్స్‌ని కూడా ఈ సర్వీస్‌లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్‌గా ఆమె ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టుబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక త్వరలోనే ఏపీ దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కూడా ఆమె కలిసి గీత విశ్వ విద్యాలయం గురించి చర్చిస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కూడా ఈ యూనివర్సిటీ గురించి ఆమె చర్చించి ప్రభుత్వ సహకారం కోరనున్నారు. పవన్ కళ్యాణ్ తో ఆమె విడిపోయిన తర్వాత మళ్ళీ భేటీ కాలేదు అధికారికంగా. ఇప్పుడు ఆమె భేటీ కానుండటంతో పవన్ ఫాన్స్ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్