Sunday, March 22, 2026 08:46 AM
Sunday, March 22, 2026 08:46 AM

గ్యాప్ ఇచ్చిన ముద్దుగుమ్మలు..!

గ్యాప్ తీసుకోలే… వచ్చింది అంటున్నారు టాలీవుడ్ ముద్దుగుమ్మలు. కావాల్సినంత క్రేజ్ ఉన్నా ఎందుకో కొన్నాళ్లుగా సైలెంట్‌ అయ్యారు. అప్ కమింగ్ మూవీలతో మళ్లీ లైన్లలోకి రావాలని ట్రై చేస్తున్నారు. ఇండస్ట్రీలో హీరోలు గ్యాప్ తీసుకున్నా మ‌ళ్లీ.. ఫామ్‌లోకి వ‌స్తారు. కానీ.. హీరోయిన్‌లకు అలా కాదు. ఒక‌సారి తెర వెన‌క్కి వెళ్లారంటే మ‌ళ్లీ పైకి రావ‌డం చాలా క‌ష్టం. అతికొద్ది మంది మాత్రమే తిరిగి పుంజుకుని మళ్ళీ ముందుకు వెళ్తారు. అయితే చాలాసార్లు అవ‌కాశాలు రాక‌, క్రేజ్ లేక ఇలా జ‌రుగుతుంటుంది. కానీ కొంద‌రు ముద్దుగుమ్మల ప‌రిస్థితి ఇందుకు రివ‌ర్స్‌గా మారింది. డిమాండ్ ఉన్నా స‌రే సైలైంట్ అయిపోయారు.

Also Read: హీరోలకు ఇది కరెక్టా.. ఆ ప్రాణానికి బాధ్యత ఎవరిది..?

గతంలో చేతి నిండా సినిమాలతో ఏడాది పొడవునా బిజీగా ఉన్న నిధి అగ‌ర్వాల్, ఐశ్వర్య రాజేశ్, సాయి ప‌ల్లవి, రాశీఖ‌న్నా, అనుష్క.. ఇలా చాలామంది తెలుగు ప్రేక్షకులను పలకరించి ఏకంగా ఏడాది దాటిపోయింది. నిన్న మొన్న వచ్చిన కుర్ర హీరోయిన్స్ అంతా క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతుంటే.. ఈ స్టార్ ముద్దుగుమ్మలు మాత్రం దూకుడు తగ్గించేశారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ రంగంలోకి దిగేస్తున్నారు. లేట్ అయినా సరే లేటేస్ట్‌గా క్రీజ్‌లోకి దిగుతున్నారు బ్యూటీలు. భారీ ప్రాజెక్టులతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. నిధి అగర్వాల్ వెండితెరపై కనిపించి రెండేళ్లు అవుతోంది. చివరగా 2022 సంక్రాంతికి ‘హీరో’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. దాదాపు లాంగ్ గ్యాప్ తీసుకున్న బ్యూటీ… రెండు బడా ప్రాజెక్టులతో ముందుకు వస్తోంది.

Also Read: ఊగిపోయిన తెలుగు రాష్ట్రాలు… 1969 తర్వాత భారీ భూకంపం

ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి క్రేజీ ప్రాజెక్టులు… బ్యూటీ ఫ్యూచర్‌ను డిసైడ్ చేయనున్నాయి. ఇక తెలుగమ్మాయి అయిన ఐశ్వర్య రాజేష్… టాలీవుడ్‌లో సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఆ మధ్య టైర్ 2 హీరోల సినిమాల్లో నటించినా… గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు బిగ్ ప్రాజెక్ట్‌తో సక్సెస్ కొట్టేందుకు రెడీ అయింది. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో పలకరించనుంది. ఇక మరి కొంతమంది బ్యూటీలు గ్యాప్ తీసుకుని వచ్చే ఏడాది సిల్వర్ స్క్రీన్ పై మెరిసేందుకు రెడీ అవుతున్నారు. హ్యాట్రిక్ హిట్లతో దూకుడు మీదున్న సంయుక్త మీనన్… డెవిల్ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్నారు. ప్రజెంట్ రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ… పాన్ఇండియా రేంజ్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.

Also Read: కార్యకర్తలు.. అభిమానులు ఒక్కటే అని ప్రూవ్ చేసిన పుష్ప 2

ఇక లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి విరాట పర్వం తర్వాత గ్యాప్ తీసుకుంది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చినా… కావాలని సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చిన బ్యూటీ… బిగ్ ప్రాజెక్టులతో దూకుడు పెంచింది. తండేల్‌తో పాటు బాలీవుడ్ రామాయణంలో నటిస్తోంది. రీసెంట్‌గా అమరన్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక సీనియర్ బ్యూటీ అనుష్క శెట్టి…. చాలా గ్యాప్ తర్వాత వరుస సినిమాలతో దూకుడు పెంచుతోంది. రాశీ ఖన్నా ‘థ్యాంక్యూ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ… ‘తెలుసు కదా’ సినిమాతో వచ్చేస్తోంది. ఇన్నాళ్లు వచ్చిన గ్యాప్‌ను భర్తీ చేసుకునేందుకు రెండు, మూడు సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు.

తెలుగులో గ్యాప్ మెయింటెయిన్ చేస్తున్న ఈ బ్యూటీస్‌లో కొందరు, వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఆ సినిమాలు హిట్టయితే మళ్లీ కొన్నాళ్లు వీళ్ల హవా కొనసాగే అవకాశం ఉంటుంది. లేకపోతే ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకునే ప్రమాదం ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్