Sunday, March 22, 2026 06:20 AM
Sunday, March 22, 2026 06:20 AM

గిరిజన ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్లు ఎలా ఉన్నాయని అప్పుడప్పుడు జిల్లా కలెక్టర్లు, అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేయడం సర్వ సాధారణం. కొన్ని సార్లు ఎమ్మెల్యేలు కూడా అలా ఆ దారిలో పోతూ చెక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా చేసిన సమయంలో వాటిలో వాస్తవ పరిస్థితులు బయటకు వస్తాయి. నిజానికి ఇలాంటి చెకింగ్‌లు ఎక్కువగా ప్రతిపక్ష నేతలు చేస్తారు. ప్రభుత్వ పనితీరును ప్రశ్నించడానికే ఇలా ఆకస్మిక తనిఖీలు చేస్తారు. అయితే ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే చేసిన ఆకస్మిక తనిఖీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే పరిశీలనలో దిమ్మతిరిగి బొమ్మ కనిపించే షాకింగ్ విషయాలు కనిపించాయి.

మిరియాల శిరీషా దేవి ఎనిమిదేళ్ల అంగన్‌వాడీ టీచర్‌గా పని చేశారు. 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో రంపచోడవరంనియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మిపై 9 వేల 139 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్‌గా కూడా ప్రస్తుతం ఆమె కొనసాగుతున్నారు. ఆమె చాలా సాదాసీదాగా నియోజకవర్గంలో తిరిగేస్తున్నారు. ఓ స్కూటీ పైన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తాజాగా ఆమె ఏకలవ్య విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. స్కూటీపై సాధారణంగా వెళ్లి పాఠశాలల తనిఖీ చేశారు.

Also Read : వైసీపీపై ప్రజాగ్రహం.. లేదంటే బహిష్కరణే..!

గిరిజన మహిళా ఎమ్మెల్యే ఏకలవ్య ఆశ్రమ గురుకుల పాఠశాలకు నైట్ డ్రెస్‌తో స్కూటీపై సాధారణ మహిళ మాదిరిగా చేరుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిపుత్రుల బిడ్డలు చదివే గురుకుల పాఠశాలలో విద్యాబోధన ఏవిధంగా ఉంది.? అంతకుమించి వారికి నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా.. తెలుసుకునేందుకు నైట్ డ్రెస్‌లో వెళ్ళిన ఎమ్మెల్యే అక్కడి పరిస్థితులు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడి షాకింగ్ విషయాలు చూసి ఎమ్మెల్యే శిరీషా దేవి ఆశ్చర్యపోయారు.

సాధారణ మహిళ మాదిరిగా లోపలికి వెళ్లి ఒక్కొక్కటి చూస్తూ ముందుకు వెళ్లారు. మెనూలో ఉన్న వంటకాలు లేకపోవడం, పౌష్టికాహారాలు విద్యార్థులకు అందకపోవడం, ఎన్నో సమస్యల్లో విద్యార్థులు ఉండడాన్ని స్వయంగా మహిళ ఎమ్మెల్యేక శిరీషా దేవి గమనించారు. ముందు వచ్చింది ఎవరో తెలియక హాస్టల్ నిర్వాహకులు ఎదిరించారు. అయితే చివరికి వచ్చింది ఎమ్మెల్యే అని తెలుసుకుని హాస్టల్ నిర్వాహకులు కంగుతున్నారు. నైట్ డ్రెస్ లో స్కూటీపై ఆకస్మికంగా ఏకలవ్య ఆశ్రమ గురుకుల విద్యార్థినిల పాఠశాలను చెకింగ్ నిర్వహించిన గిరిజన మహిళ ఎమ్మెల్యే ఎంట్రీతో అక్కడ పరిస్థితులు బయటపడ్డాయి. విద్యార్థినుల సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా తెలుసుకున్నారు.

రాజువొమ్మంగి మండలంలోని ఏకలవ్య ఆశ్రమ గురుకుల పాఠశాలను రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీష దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాత్రిసమయంలో విద్యార్థులకు అందే సౌకర్యాలు, మెనూ తదితర విషయాలు నేరుగా చూసేందుకు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.ఎమ్మెల్యే హస్టల్‌కు వచ్చిన సమయంలోనే విద్యార్థినులు భోజనం చేస్తున్నారు. వారితో కలిసి ఆమె కూడా భోజనం చేశారు. మెనూ ప్రకారం లేదని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అస్సలు ఫుడ్ బాగలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చూడటానికి రైస్ బాగుందని.. మజ్జిగ మంచినీళ్ల మాదిరిగా ఉందని.. వార్డెన్ లేరని.. పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. మధ్యాహ్నం పెట్టిన కూరనే మళ్లీ రాత్రికి వడ్డించినట్లు తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : ఆ విషయంలో విఫలమైన టీడీపీ, జనసేన..!

ఈరోజు లిస్టులో ఉన్నది ఏంటి.. విద్యార్థులకు పెట్టింది ఏంటి అని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చూపిస్తున్న మెనూ ఆ గిరిజన హాస్టల్ లో అమలు కాకపోవడం, చికెన్ అరటిపండు లాంటి పోష్టిక ఆహారాలు విద్యార్థులకు పెట్టకపోవడంపై ఎమ్మెల్యే శిరీష అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. విద్యార్థులకు కనీతం తాగునీరు, కనీస వసతులు కూడా సరిగ్గా లేవని.. అలాగే హాస్టల్‌లో ఉండాల్సిన సిబ్బంది లేరనే విషయాన్ని ఎమ్మెల్యే గుర్తించారు. ప్రభుత్వం నుంచి లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్న హాస్టల్ నిర్వాహకులు.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతులు కల్పించటం లేదని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో చాలా హాస్టల్స్‌లో పరిస్థితి ఇలాగే ఉందని.. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తనిఖీ చేస్తే.. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సూచిస్తున్నారు. చాలా హాస్టల్స్‌లో మౌలిక వసతుల కొరత ఉందని.. ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల బిల్లులు వసూలు చేస్తున్నప్పటికీ.. వాటిని సరిగ్గా వినియోగించటం లేదనేది వాస్తవం. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్యం పై నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్