Thursday, October 23, 2025 07:47 PM
Thursday, October 23, 2025 07:47 PM
roots

మెగా ఫాన్స్ కి డబుల్ ధమాకా

మెగా కుటుంబంలో మరోసారి సెలబ్రేషన్స్ హాట్ టాపిక్‌గా మారాయి. మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీపావళి పండుగ సందర్భంగా చిరంజీవి ఇంటికి స్టార్ హీరోలు వెంకటేష్, నాగార్జున కుటుంబాలతో సహా వచ్చారు. ఈ ఫోటోలను చిరంజీవి అధికారికంగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇవి చూసిన నెటిజన్లు.. దీపావళి స్పెషల్ అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ కలయిక వెనుక అసలు రహస్యాన్ని ఉపాసన రివిల్ చేశారు.

Also Read : సమంత–రాజ్‌ నిడిమోరు లవ్‌ స్టోరీ నిజమా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నారు. మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ పాటు ఉపాసన సీమంతం వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ వీడియోను ఉపాసన షేర్ చేస్తూ డబుల్ సెలబ్రేషన్స్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇప్పటికే చరణ్ – ఉపాసన జంటకు 2023 జూన్‌లో క్లీంకార జన్మించగా.. రెండేళ్ల తర్వాత మరోసారి ఉపాసన తల్లి కాబోతున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈసారి రాంచరణ్ దంపతులకి కవల పిల్లలు అంటూ మరో సమాచారం తెలుస్తుంది. అదే నిజమైతే మెగా కుటుంబానికి, ఫాన్స్ కి డబుల్ ధమాకా అనుకోవచ్చు.

Also Read : ప్రభాస్ పై బాలీవుడ్ హీరోయిన్ రాజకీయం..?

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ వేడుకకు చరణ్, ఉపాసన తరఫు బంధువులతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. నాగబాబు కుటుంబంతో పాటు పవన్ సతీమణి, నాగార్జున కుటుంబం, ఇతర బంధువులు అంతా ఈ వేడుకలో పాల్గొన్నారు. వరుణ్ తేజ్, లావణ్య దంపతులు కూడా తమ కుమారుడితో కలిసి వేడుకలో పాల్గొన్నారు. ఈ వీడియో షేర్ చేసిన ఉపాసన.. “Celebrating New Beginnings” అంటూ రాసుకొచ్చారు. ఈ కామెంట్ పక్కనే చిన్నారుల పాదాలు ఉండటంతో ఈ వేడుక కేవలం దీపావళి సంబరాలు కాదని.. ఉపాసన సీమంతం అని అర్థమవుతోంది. అయితే ఈ వీడియోలో ఉన్న గ్రూమ్ ఫోటోల్లో చరణ్ కుమార్తె క్లీంకారా ఉన్నప్పటికీ.. కనిపించకుండా బ్లర్ చేసేశారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

కొలికపూడి వర్సెస్ కేసినేని.....

తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు...

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

బ్రేకింగ్: తుని ఘటనలో...

గత రెండు రోజుల నుంచి అత్యంత...

దానం చుట్టూ మరో...

దానం నాగేందర్.. తొలి నుంచి వివాదాలు...

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

పోల్స్