సూపర్ రజనీ కాంత్, కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో వచ్చిన కూలీ సినిమా కలెక్షన్ ల పరంగా దూసుకుపోతోంది. ముందు వసూళ్ళలో వెనుకబడిన ఈ సినిమా క్రమంగా దూకుడు పెంచింది. తమిళంలో మరో సినిమా లేకపోవడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. కూలీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్ రజనీ కాంత్ ఫ్యాన్స్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమా 500 కోట్ల మార్క్ దాటింది. రెండవ వారంలో సినిమా కలెక్షన్ లు భారీగా పడిపోయినా సరే ఈ మార్క్ దాటింది.
Also Read : బెజవాడలో ఆపిల్ స్టోర్..? టెక్ దిగ్గజం కీలక నిర్ణయం..!
2025 సంవత్సరంలో 500 కోట్ల రూపాయల కలెక్షన్ లు దాటిన మూడవ సినిమా ఇది. 14 రోజుల తర్వాత ఈ మార్క్ దాటినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా ఓవర్సీస్ లో 21 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు సినీ అనలిస్ట్ లు. సినిమా విడుదలైన మొదటి వారంలో యూకే, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. భారతీయులు ఎక్కువగా ఉండే దేశాల్లో భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఇదే సినిమాకు మరింత కలిసి వచ్చింది.
Also Read : డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ లీక్.. గిల్ తండ్రిపై ఆరోపణలు
యంగ్ హీరోలకు సైతం సాధ్యం కాని విధంగా రజనీ కాంత్ సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. తమిళంలో భారీ వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా కూలీ నిలిచింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, 488 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును కూలీ అధిగమించింది. అత్యధిక వసూళ్లు చేసిన టాప్ 10 దక్షిణాది సినిమాల్లోకి అడుగుపెట్టింది కూలీ. అటు బాలీవుడ్ లోని భారీ బడ్జెట్ సినిమాల రికార్డులను కూడా కూలీ మరో వారం రోజుల్లో బ్రేక్ చేసే అవకాశం కనపడుతోంది.