Monday, October 27, 2025 07:50 PM
Monday, October 27, 2025 07:50 PM
roots

కోడెలకు అండగా నిలిచాననే జగన్ దూరం పెట్టారు: రఘురామ

రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రియాక్ట్ అయ్యారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తున్నామన్నారు. రతన్ టాటా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. రతన్ టాటా కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదని గొప్ప మానవతావాదని అభివర్ణించారు రఘురామకృష్ణంరాజు.

Also Read : బాబు సంతకంతో జగన్ సైలెంట్..!

విద్య వైద్యం తో పాటుగా అనేక రంగాల్లో ఆయన చేసిన సేవలు వెలకట్టలేని అని ఆయన కొనియాడారు. రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని అందరి కోరిక అన్నారు రఘురామ. ఈ విషయంపై తాను నాలుగేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశానని.. అవార్డు ఇచ్చిన లేకపోయినా ఆయన భారతీయుల హృదయాల్లో రత్నమేనని కొనియాడారు. జగన్ తనను దూరం పెట్టడానికి గల కారణాన్ని రఘురామకృష్ణం రాజు బయటపెట్టారు.

Also Read : సాయిరెడ్డితో వైసీపీ రాజీ కష్టాలు

దివంగత టిడిపి నేత కోడెల శివప్రసాదరావుతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న రఘురామకృష్ణంరాజు, తెలుగుదేశం పార్టీ హయాంలో స్పీకర్ గా చేసిన కోడెల శివప్రసాద్ పై వైసీపీ నాయకులు చిల్లరి మాటలు మాట్లాడుతుంటే వాటిని సహించలేకపోయాను అని అన్నారు. తాను వ్యతిరేకించడంతోనే జగన్ తనను పక్కన పెట్టారని రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోడెల శివప్రసాద్ ను కావాలనే అప్పట్లో వైసీపీ వేధించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని పత్రికలు కావాలనే విషం చిమ్ముతున్నాయన్నారు రఘురామ.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్