Sunday, March 22, 2026 05:10 AM
Sunday, March 22, 2026 05:10 AM

రాశీ ఖన్నా బోల్డ్ కామెంట్స్ వైరల్.. అభిమానితో డేటింగ్ కి రెడీనా?

ఇండస్ట్రీలో అందం, టాలెంట్, డ్యాన్స్, కామెడీ టైమింగ్ ఇలా అన్ని కోణాల్లో పర్ఫెక్ట్‌గా ఉండే హీరోయిన్స్ చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన ప్రతిభ కలిగిన నటీమణుల్లో రాశీ ఖన్నా ఒకరు. అందం మాత్రమే కాకుండా, కామెడీ టైమింగ్‌కి పేరుంది, అలాగే విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌ను కూడా అద్భుతంగా చేసి చూపగల సామర్థ్యం ఉంది. కానీ ఇటీవల ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న చాలా మంది కంటెస్టెంట్స్ అందాలను ఆరబోయడమే తప్ప, అసలైన నటనలో మాత్రం వెనుకబడి ఉన్నారని ప్రేక్షకుల్లో అభిప్రాయం కలుస్తోంది. అలాంటి వారితో పోలిస్తే రాశీ ఖన్నా చాలా రెట్లు మెరుగైన నటి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ, ఆమెకు కెరీర్ పరంగా అదృష్టం మాత్రం ఆశించినంతగా కలిసి రాలేదు.

Also Read : అమ్మో ఉప ఎన్నిక.. ఖర్చు దెబ్బకు వణుకుతున్న రాజకీయ పార్టీలు..!

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జై లవకుశ రాశీ కెరీర్‌కు పెద్ద మలుపు అవుతుందని అప్పట్లో అందరూ భావించారు. సినిమా పెద్ద హిట్ అయినా, ఆమె కెరీర్‌లో పెద్ద విజయాల వరుస మాత్రం ప్రారంభం కాలేదు. దాంతో మళ్లీ మీడియం రేంజ్ హీరోల సినిమాల్లోనే కొనసాగుతూ, అదే స్థాయిలో స్థిరపడిపోయింది. బాలీవుడ్‌లో నటించిన కొన్ని సినిమాలు కూడా పెద్దగా ఫలితం ఇవ్వకపోవడంతో, అక్కడ కూడా ఆశించిన గుర్తింపు రాలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ అవకాశం దక్కింది. అయితే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయినా కూడా రాశీకి పెద్ద ఇంటర్‌నల్ బూస్ట్ వచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

Also Read : ఇదేం పిచ్..? ఆస్ట్రేలియా పై తీవ్ర విమర్శలు

ఇదంతా పక్కన పెడితే, రీసెంట్‌గా ఒక బ్రాడ్‌కాస్ట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశీ చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. “మీకు ఒక అభిమాని‌తో డేటింగ్ చేసే అవకాశం వస్తే చేస్తారా?” అని అడగగా, రాశీ ఖన్నా చాలా స్ట్రైట్‌గా స్పందించింది. “నాకు అలాంటి ఆలోచనలు లేవు. అభిమానులు మనల్ని ఒక ఉన్నత స్థాయిలో చూస్తారు. దూరం నుండే మమ్మల్ని మెచ్చుకోవడం వారికి కూడా మంచిది. దగ్గరగా చూసినప్పుడు వాళ్లకు అనిపించే ఫీలింగ్స్ వేరేలా ఉంటాయి. అందుకే ఏ అభిమాని అయినా దూరంలో ఉంటేనే బాగుంటుంది అని నేను నమ్ముతాను” అని ఆమె చెప్పిన బోల్డ్ కామెంట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్