సాధారణంగా ఎక్కడైనా, ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఎవరికి నచ్చిన ప్రచారం వారు చేస్తూ ఉంటారు. తాజాగా జరిగిన విమాన ప్రమాదం విషయంలో కూడా ఇదే ప్రచారం జరుగుతోంది. విమానంలో ఉన్న కొన్ని సమస్యల గురించి ఓ ప్రయాణికుడు వీడియో పోస్ట్ చేసాడు. అసలు విమానాన్ని ఎలా నడుపుతున్నారో అర్ధం కావడం లేదని అతను చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. టెలిఫోన్ సరిగా పని చేయడం లేదని, ఏసీ సరిగా వర్క్ అవ్వట్లేదు అంటూ వీడియో చేసాడు.
Also Read : మధ్య ప్రాచ్యంలో మరో యుద్ధం తప్పదా..?
ఈ వీడియో సామాన్య ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళడమే కాకుండా.. విమాన ప్రమాదానికి అవే కారణాలు అంటూ కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి ఏసీ, టెలీఫోన్ సమస్యలకు ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి సంబంధం లేదు. ఎన్నో విమానాల్లో ఈ సమస్యలు రెగ్యులర్ గా ఉండేవే. అయితే ఇక్కడ ప్రమాదానికి గల కారణాలు ఏంటీ అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పలువురు నిపుణుల అభిప్రాయాల ప్రకారం దీని వెనుక కుట్ర ఉండవచ్చనే వాదనలు వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది.
Also Read : ఎలా బతికానో చెప్పిన రమేష్.. సీటు బెల్ట్ ప్రాణాలు కాపాడిందా..?
పక్షి కారణం అయితే.. రెండు ఇంజిన్ లకు ఒకేసారి ఎలా కొడతాయి..? అది ఏ విధంగా సాధ్యం అనేది ప్రధాన ప్రశ్న.. సరే ఇంజిన్ విఫలమైతే.. అసలు రెండు ఇంజిన్ లు ఒకసారే ఎలా విఫలమవుతాయనేది రెండో ప్రశ్న.. లగేజి ఓవర్ వెయిట్ అంటే.. అసలు లగేజ్ ఎంత లోడ్ చేస్తున్నాము.. అది సరైన దిశలో ఉందా లేదా అనేది ముందే చెక్ చేసుకుంటారు. అంతర్జాతీయ విమానాలకు ఇది పక్కాగా జరుగుతోంది.. మరి లగేజ్ ఓవర్ లోడ్ అనేది ఎలా సాధ్యం అనేది మూడవ ప్రశ్న. ఇంధనం ట్యాంకులలో వాటి లిమిట్ ప్రకారం నింపడం ఇబ్బంది వచ్చే సమస్య కాదు.. విమానం హ్యాండిల్ చేయగలిగే బరువునే కదా..? మరి అలాంటప్పుడు ఇంధన ప్రభావం ఎలా ఉంటుంది అనేది నాలుగవ ప్రశ్న.. ఏది ఎలా ఉన్నా ఈ ప్రశ్నలకు విచారణలోనే సమాధానాలు బయటకు రావాలి.




