టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న పూరి.. ఒక భారీ హిట్టు కోసం కథను రెడీ చేస్తున్నాడు. అక్కినేని అఖిల్ కు ఇప్పటికే కథ వినిపించిన పూరి జగన్నాథ్.. త్వరలోనే మరో స్టోరీ కూడా ఓ తమిళ హీరోకు వినిపించేందుకు కసరత్తు చేస్తున్నాడు. త్వరలోనే అఖిల్ తో సినిమా మొదలుపెట్టి ఆరు నెలల్లో సినిమాను కంప్లీట్ చేసి.. రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడట.
Also Read : చిరంజీవి – అనీల్ రావిపూడి మూవీ బ్యాక్ డ్రాప్ ఇదే
ఆ కథ నాగార్జునకు బాగా నచ్చటంతో అఖిల్ కూడా సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సినిమాను పూరి జగన్నాథ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు పూరి జగన్నాథ్. విజయ్ సేతుపతికి విలక్షణ నటుడిగా పేరు ఉంది. తమిళంతో పాటుగా తెలుగులో కూడా అతనికి మంచి క్రేజ్ ఉండటంతో.. అతనితో సినిమా చేస్తే బాగుంటుందని పూరి వర్కౌట్ చేస్తున్నట్లు టాక్.
Also Read : త్రివిక్రమ్ కు హ్యాండ్ ఇచ్చేసాడు.. బన్నీ షాకింగ్ స్టెప్
దీనికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడు. త్వరలోనే ఆ స్క్రిప్ట్ ను విజయ్ సేతుపతికి వినిపిస్తానని.. పక్కాగా అతను ఓకే చెప్తాడనే ధీమా లో ఉన్నాడు పూరి. ఇటీవల గోపీచంద్ కు కుడా ఓ కథ వినిపించాడని.. అయితే కొన్ని కారణాలతో ఆ సినిమా ముందుకు వెళ్లలేదని సమాచారం. అయితే అఖిల్ తో చేసే సినిమా మాత్రం త్వరలోనే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఉగాది తర్వాత దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. దసరా లేదా సంక్రాంతికి ఆ సినిమాను రిలీజ్ చేయాలని పూరి టార్గెట్ పెట్టుకున్నాడట.