హీరోయిన్ జత్వాని కేసులో అరెస్ట్ అయిన ఐపిఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు తనపై నమోదైన కేసులో జడ్జి ముందు తన వాదనలు తానే వినిపించుకున్నారు. జత్వాని కేసులో ఏం జరిగిందని అంశాలను జడ్జ్ కు వివరించారు పీఎస్ఆర్ ఆంజనేయులు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తన వాదనలు వినిపించారు. నా పాత్ర లేకపోయినా నా పై కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసారు. మాజీ డీసీపీ విశాల్ గున్నిని ప్రొటెక్ట్ చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో అప్రూవర్ గా మారాడన్నారు.
Also Read : అసలు దొంగ బీహార్ పారిపోయాడు: రఘురామ
ఈ కేసులో తనకు సంబంధం లేని విషయాలను చెప్పించారని జడ్జ్ ముందు వాదించారు ఆంజనేయులు. 164 స్టేట్మెంట్ ఇవ్వమని విశాల్ గున్నిని అడిగినా ఇవ్వడానికి ఆయన నిరాకరించారని, అకారణంగా అక్రమంగా నన్ను అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేసారు. Cr 90 ఫిబ్రవరి -2024 పెట్టిన కేసులో నేను ఎక్యూసెద్ కాదు విట్నెస్ కాదని.. జత్వానికి కేసులు నన్ను ఎలా అరెస్టు చేస్తారు అని ప్రశ్నించారు. విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పిఎస్ఆర్ ని అరెస్టు చేశామని.. జాయిన్ట్ డైరెక్ట్ర్ ప్రాసిక్యూషన్ రాజేంద్రప్రసాద్ కోర్ట్ కు తెలిపారు. 469/24 లో ముందస్తు ఎంక్వయిరీ చేయవద్దని హైకోర్టు ఆర్డర్ ఉందని వాదించగా.. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ లో భాగంగా విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంట్ ని ఈ కేసు కేల జత చేస్తారు అని ప్రశ్నించారు.
Also Read : కసిరెడ్డిని కాపాడుతున్నందుకేనా..? పీఎస్ఆర్ అరెస్ట్ వెనుక సంచలనం
డిపార్ట్మెంట్ ఎంక్వయిరీ లో విశాల్ గున్ని ని నాపై అగైనెస్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వమన్నారు అని చెబితే ఇవ్వద్దు ఇది తప్పు అని చెప్పానని.. పిఎస్ఆర్ ఆంజనేయులు వాదించారు. డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ ని జత్వాని కేసుకి ఎలా సింక్ చేస్తారు అని అడిగిన పీఎస్ఆర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. అయినప్పటికీ విశాల్ గున్ని ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చారో తనకు తెలియదన్నారు. కాంతి రాణా, విశాల్ గున్నీ లాంటి ఆఫీసర్స్ ని నేను సాధారణంగా కలుస్తూ ఉంటానని.. ఎక్కువగా కలిసింది ఎన్నికల సమయంలో అంటూ వాదించారు. ఈ కేసులో నేనెప్పుడూ వాళ్ళని కలవలేదని కోర్ట్ కు వివరించారు. నేను సూపర్వైజర్ ఆఫీసర్ కాదు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదని.. నేను డిఐజి ఇంటెలిజెన్స్ ని నాకు ఈ కేస్ తో నాకు సంబంధం లేదన్నారు ఆంజనేయులు.

