Monday, October 27, 2025 10:31 PM
Monday, October 27, 2025 10:31 PM
roots

మంచం కింద దూరాడు.. ఇప్పుడేమంటారు..?

వైసీపీ నేతలకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు… లేనప్పుడు కూడా ఒకేలా వ్యవహరిస్తూ… అడ్డంగా బుక్ అవుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నో విషయాల్లో అడ్డంగా దొరికిపోయారు. ఆయా నేతలపై ఇప్పటి వరకు పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ద్వితీయ శ్రేణి నేతలు కూడా తమ నాయకుల మార్గంలోనే నడుస్తున్నారు. విజయవాడలో జరిగిన పోలీస్ రైడింగ్‌లో వైసీపీ నేత ఒకరు అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఈ విషయంపై వైసీపీ నేతలంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

Also Read : ఏపిలో డయల్ యువర్ సీఎం.. ఎవరికి.. ఎందుకు?

యూ ట్యూబ్ ఆఫీస్ ముసుగులో భార్గవ్ అనే వ్యక్తి స్పా సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి… మసాజ్ పేరుతో సెక్స్ వ్యాపారం చేయిస్తున్నాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న విజయవాడ పోలీసులు… కమిషనర్ ఆదేశాలతో యూ ట్యూబ్ ఆఫీస్‌పై దాడి చేశారు. ఈ దాడిలో 11 మంది విటులతో పాటు దాదాపు 20 మంది అమ్మాయిలు కూడా పట్టుబడ్డారు. బయటకు స్టూడియో 9 పేరుతో యూ ట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న భార్గవ్… లోపల మాత్రం సెక్స్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రైడింగ్ విషయం ముందుగానే తెలుసుకున్న భార్గవ్.. పరారయ్యాడు. దీంతో మిగిలిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read : వంశీకి మ్యూజిక్ స్టార్ట్..!

అయితే ఈ రైడింగ్‌లో భార్గవ్ కోసం వల వేసిన పోలీసులకు ఊహించని వ్యక్తి చిక్కాడు. వైసీపీ ఎస్టీ విభాగం నాయకుడు, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకుని గదిలో మంచం కింద దూరాడు శంకర్ నాయక్. వాస్తవానికి మసాజ్ కోసం మాత్రమే వచ్చుంటే… శంకర్ దాక్కోవాల్సిన అవసరం లేదు. “మసాజ్ కోసం మాత్రమే వచ్చాను”.. అని ధైర్యంగా చెప్పేసి వెళ్లిపోవచ్చు. కానీ శంకర్ నాయక్ మాత్రం మంచం కింద దూరి దాక్కొవ్వాల్సిన అవసరం ఏముందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. శంకర్ ఉన్న గదిలో ఓ అమ్మాయిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గిరిజన నేత అని చెప్పుకుంటున్న శంకర్ నాయక్.. అప్పుడప్పుడు ధర్నాలు, నిరసనలు చేస్తుంటాడు. ఇటీవల ఓ ప్రవేటు కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే.. అక్కడికి వెళ్లి నానా యాగీ చేశాడు. దీంతో ఇదే అవకాశంగా భావించిన పోలీసులు శంకర్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Also Read : జియో ఫేక్ వ్యూస్..? నిజంగా అంత మంది చూసారా…?

ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు శంకర్ నాయక్ ఓ వ్యభిచార కేసులో అరెస్ట్ కావడంతో… వైసీపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగా అయ్యింది. శంకర్ నాయక్ మంచం కింద దాక్కున వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మంచం కింద ఉన్న శంకర్‌ను పోలీసులు బయటకు రావాలని పిలుస్తున్న వీడియో… బయటకు వచ్చిన తర్వాత ముఖానికి చెయ్యి అడ్డు పెట్టుకున్న ఫోటోలు ఇప్పటికే అందరికీ చేరిపోయాయి. దీంతో సోషల్ మీడియాలో శంకర్ ఫోటోలు పోస్టు చేస్తున్న కొందరు… అంబటి, అవంతి, గోరంట్ల.. ఇప్పుడు శంకర్ నాయక్… యథా రాజా.. తథా శ్రేణి.. అంటూ పోస్టులు పెడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్