Sunday, March 22, 2026 06:16 AM
Sunday, March 22, 2026 06:16 AM

ప్రియాంక మూడేళ్ళు బలి.. రాజమౌళి ప్లానింగ్ అదే

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళితో సినిమా అంటే యాక్టర్స్ కు ఖచ్చితంగా చుక్కలు కనబడతాయి. ఆయన చాలా స్లోగా సినిమా చేయడంతో హీరోలకు హీరోయిన్లకు ఎప్పుడు సినిమా కంప్లీట్ అవుతుందో క్లారిటీ ఉండదు. వేరే ప్రాజెక్టులు మొదలు పెట్టాలో లేదో కూడా జక్కన్న క్లారిటీ ఇవ్వరు. ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం హాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టిన ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటించడానికి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also Read: టీటీడీ సంచలన నిర్ణయం..? వారికి గుడ్ బై..?

రీసెంట్ గా హైదరాబాద్ లో ల్యాండ్ అయిన ఆమె.. చిలుకూరు బాలాజీ టెంపుల్ లో కనిపించింది. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి ఇప్పటికే ప్రియాంక చోప్రాను ఫైనల్ చేశారని టాక్. కానీ నిర్ణయం మాత్రం ప్రియాంక చేతుల్లోనే ఉందనే సిగ్నల్స్ కూడా ఇస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపుగా ఏడాదికిపైగా ఆమెను డేట్స్ అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఏడాది మొత్తం ఒకే సినిమాకు ప్రియాంక చోప్రా డేట్ ఇవ్వటం అనేది కష్టమే. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రియాంక చోప్రా ఒప్పుకునే ఛాన్స్ ఉన్నా ఆమెను ఒక భయం వెంటాడుతోంది.

Also Read: గేట్స్-బాబు మీట్.. నేషనల్ మీడియా హడావుడి…!

రాజమౌళి హిస్టరీ ప్రకారం రెండేళ్ల సినిమా 5 ఏళ్లకు పూర్తవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆమె ఏడాది అంటే కనీసం మూడు ఏళ్లకు పైగానే రాజమౌళికి సమయం ఇవ్వాలి. అందుకే ప్రియాంక చోప్రా ఈ విషయంలో వెనకడుగు వేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సినిమా లొకేషన్స్ ని కూడా ఫైనల్ చేశారు. ఈ నెలాఖరున కొత్త షెడ్యూల్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక సెట్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడే కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. మరి ప్రియాంక చోప్రా డేసిషన్ ఏంటో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్