Friday, September 12, 2025 07:04 PM
Friday, September 12, 2025 07:04 PM
roots

కల్కీ సీక్వెల్ రిలీజ్ అప్పుడే.. డైరెక్టర్ క్లారిటీ

టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలంటే ఉండే క్రేజ్ వేరే లెవల్ లో ఉంటుంది. సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాలో సందడి వాతావరణం ఉంటుంది. ఇక అభిమానులు కూడా ప్రభాస్ గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే మార్కెటింగ్ వేరే లెవెల్ లో చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ప్రభాస్ ఎనిమిది సినిమాల్లో నటిస్తుంటే రెండు సీక్వెల్స్ లో యాక్ట్ చేస్తున్నాడు. ఒకటి కల్కి సీక్వెల్ కాగా మరొకటి సలార్ సిక్వెల్. ఇక కల్కి సీక్వెల్ గురించి ఈమధ్య డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు.

Also Read: ఇన్కమ్ టాక్స్ ఫోకస్ నుంచి తప్పించుకున్న నాగవంశీ

రీసెంట్ గా ఈ సినిమా గురించి మాట్లాడిన డైరెక్టర్ సినిమా షూటింగ్ కొంత కంప్లీట్ అయిందని త్వరలోనే మరి కొంత షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ అవ్వబోతుందని చెప్పాడు. ఇక ఈ సినిమాను 2026 చివరి నాటికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం ప్రభాస్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడని.. ప్రభాస్ కొంచెం ఫ్రీ అవ్వగానే కల్కి పై ఫోకస్ పెడతాడని చెప్పుకొచ్చాడు. 2026 నవంబర్ లేదా డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నామని ప్రకటించాడు.

Also Read: మహిళలకు గుండెపోటు ఛాన్స్ ఏ టైం లో అంటే…?

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత కంప్లీట్ చేసిన మేకర్స్ కొన్ని క్రేజీ అప్డేట్స్ కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పార్టు 1 కంటే పార్ట్-2 బడ్జెట్ ఎక్కువ ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతుంది ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉండే ఛాన్స్ ఉంది. అంచనాలకు మించి కలెక్షన్స్ రావడంతో.. రెమ్యూనరేషన్ విషయంలో ప్రభాస్ కూడా వెనక తగ్గడం లేదు. ప్రస్తుతం హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో ప్రభాస్ మూడు సినిమాలు చేస్తున్నాడు. వీటికి ఏకంగా 550 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్