సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే. అయితే సినిమా హీరోకు, నటీ నటులకు అభిమానులు ఉండటం సర్వ సాధారణం. తమ అభిమాన హీరో సినిమా విడుదలకు ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక సినిమా హిట్ అయితే.. ఆ ఫ్యాన్స్‌కు పండగే. అదే సినిమా ప్లాప్ అయితే.. నిరాశపరిస్తే.. హీరో తప్పు ఏ మాత్రం కాదు.. తప్పంతా దర్శక నిర్మాతలదే. ఇంకా చెప్పాలంటే.. హిట్ క్రెడిట్ అంతా హీరోకు.. ఫ్లాప్ క్రెడిట్ అంతా డైరెక్టర్‌కు. ఇదే అభిమానులు పాటించే సూత్రం.
తాజాగా ఓ సినిమా పట్ల ఆ హీరో అభిమానులు పెట్టుకున్న ఆశలు తల్లకిందులయ్యాయి. దీంతో దర్శకుడిని టార్గెట్ చేశారు. ఆయనను విచిత్రమైన రీతిలో టార్చర్ పెడుతున్నారు. రామ్ చరణ్ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఉన్నట్లు ఇంత ఫుడ్ ఎవరైనా తింటారా.. తింటే చస్తారు.. అన్నట్లుగా దర్శకుడిపై కోపాన్ని ఫుడ్ రూపంలో చూపిస్తున్నారు. దర్శకుడి ఇంటిని ఫుడ్ ఆర్డర్లతో నింపేస్తున్నారు. వాటితో వాటు విచిత్రమైన వస్తువులు కూడా పంపిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
Also Read : మరోసారి బయటపడిన జగన్ డబుల్ డైలాగ్..!
సంక్రాంతి రేసులో ముందుగా విడుదలైన సినిమా రాజాసాబ్. ఇది బాక్సాఫిస్ దగ్గర బోల్తా పడింది. అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇంకా చెప్పాలంటే.. ఆ సినిమా కథ ప్రభాస్ స్థాయి కాదు అనేది ఇప్పుడు సగటు సినీ ప్రేక్షకుడు చెబుతున్న మాట. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచే అంచనాలు భారీగా పెంచేశారు. విచిత్రంగా రెండు ట్రైలర్స్ రిలీజ్ చేయడంతో.. హైప్ బాగా పెరిగిపోయింది. ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నటీనటులు, దర్శక నిర్మాతలు చెప్పిన మాటలు చూసి.. అభిమానులు ఏదో ఊహించుకున్నారు. రూ.2 వేల కోట్లు వసూలు చేస్తుందని నటుడు సప్తగిరి వ్యాఖ్యానిస్తే.. సినిమా ప్రభాస్ ఫ్యాన్స్‌ను నిరాశపరిస్తే తన ఇంటికి వచ్చి నిలదీయాలని దర్శకుడు మారుతీ తన ఇంటి అడ్రస్ చెప్పారు.
సినిమా పట్ల అసంతృప్తితో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఇప్పుడు దర్శకుడు మారుతీ పై రివేంజ్ తీర్చుకుంటున్నారు. దర్శకుడి ఇంటికి అధిక సంఖ్యలో ఫుడ్ ఆర్డర్లు, పలు మెడికల్ షాప్ పరికరాలు ఆర్డర్ పెడుతున్నారు. దీంతో మారుతీ నివసిస్తున్న కొల్ల లక్సురియా విల్లాస్ సెక్యూరిటీ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని కొల్ల లక్స్రుయా విల్లాస్‌లో ఉంటున్న దర్శకుడు మారుతి ఇంటి పేరు మీద కొందరు అభిమానులు జొమాటో, స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఆర్డర్లు పంపుతున్నారు. సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద విల్లా సెక్యూరిటీ నిర్ధారణ కోసం దర్శకుడిని సంప్రదిస్తే నేను ఏం పెట్టలేదు అని బదులు ఇచ్చారు. కాని ఒక్కరోజే తన పేరు మీద తన ఇంటికి వందకు పైగా ఫుడ్ డెలివరీ ఐటమ్స్ రావడంతో సెక్యూరిటీ సిబ్బందికి తలనొప్పిగా మారింది.
Also Read : సంక్రాంతి ప్రభావం.. టాలీవుడ్ ఖాళీ..!
ఈ విషయంపై చేసేది ఏమి లేక అసహనం వ్యక్తం చేసిన దర్శకుడు మారుతి.. తన పేరు మీద ఏది వచ్చినా సరే లోపలకు పంపవద్దని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చిన ఆర్డర్‌లను సెక్యూరిటీ సిబ్బంది రిజక్ట్ చేస్తోంది. మరో వైపు సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యహరించిన వ్యక్తి పేరు మీద సోషల్ మీడియాలో ఫేక్ ఆల్ట్ అకౌంట్స్‌తో హీరో అభిమానులను బూతులు తిడుతున్న విషయం పెద్ద దుమారం రేపుతుంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నిర్మాత శ్రీనివాసకుమార్.. దీనిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. ఏది ఏమైనా హీరో పట్ల అంతులేని అభిమానానికి దర్శక నిర్మాతలు బలి పశువు అవుతున్నారు.

