Wednesday, February 4, 2026 06:10 PM
Wednesday, February 4, 2026 06:10 PM

మాట తప్పాడు.. మడమ తిప్పాడు..!

మాట తప్పడు.. మడమ తిప్పడు.. చెప్పాడంటే.. చేస్తాడంతే.. అనేది వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి మాట. ఇదే విషయాన్ని వైసీపీ నేతలు మహా గొప్పగా చెప్పుకుంటారు. అలాగే మేము కూడా వైఎస్ జగన్ బాటలోనే నడుస్తాం అంటారు కూడా. 2019 ఎన్నికలప్పుడు నాలుగు పేజీల మ్యానిఫెస్టో విడుదల చేశాం.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే.. 90 శాతం హామీలు అమలు చేశామని గొప్పగా చెప్పుకున్నారు. అలాగే ఒక మాట చెబితే.. ఆ మాటకు కట్టుబడి ఉంటామని కూడా ధీమాగా చెప్పారు వైసీపీ నేతలు. అయితే అది మాటలకే తెప్ప… చేతల్లో మాత్రం చూపించడం లేదు.

Also Read : ఆసక్తి రేపుతోన్న చంద్రబాబు ఢిల్లీ టూర్

అధికారంలో ఉన్నప్పుడు నోటికి వచ్చినట్లు రెచ్చిపోయారు వైసీపీ నేతలు. ఒకదశలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పై కూడా నీచమైన కామెంట్లు చేశారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితంపై కూడా విమర్శలు చేశారు. ఒకదశలో దిగజారిపోయి వ్యాఖ్యలు చేశారు. ఇందులో పోసాని కృష్ణ మురళీ ఒకరు. ఎన్నికల ముందు కూడా దారుణంగా బూతులు మాట్లాడారు. హైదరాబాద్‌లో కూర్చుని.. ఏపీ పాలిటిక్స్‌పై వ్యాఖ్యలు చేశారు. తర్వాత పవన్ భార్య పిల్లలపై కూడా కించపరిచే వ్యాఖ్యలు చేశారు పోసాని. ఇక వైసీపీ ఓటమితో ఒక్కసారిగా ప్లేట్ మార్చారు. బాబోయ్ తప్పైంది అంటూ లెంపలేసుకున్నారు. నేను నోరు జారాను.. ఇంకెప్పుడు మాట్లాడను.. అంటూ క్షమాపణ చెప్పారు. అంతటితో ఆగకుండా.. రాజకీయాలకు గుడ్ బై అని కూడా చెప్పేశారు.

Also Read : అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు.. అసలేం జరిగింది..?

అయితే చేసిన పాపానికి శిక్ష తప్పదు అన్నట్లుగా.. జనసేన పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సరిగ్గా శివరాత్రి రోజు అరెస్టు చేశారు. ఆ తర్వాత 25 రోజుల పాటు జైలు జీవితం గడిపిన పోసాని బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే కండీషన్ బెయిల్ కావడంతో.. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరవుతూనే ఉన్నారు. దీని నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు పోసాని తీవ్రంగ ప్రయత్నం చేస్తున్నారు. తనకు బెయిల్ ఇప్పంచిన వైసీపీ నేతలు, లాయర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇందులో భాగంగా తాడేపల్లి ప్యాలెస్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డితో భేటీ అయ్యారు. తనను కాపాడాలంటూ వేడుకున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలకు గుడ్ బై అని చెప్పిన వ్యక్తికి మళ్లీ పార్టీ కార్యాలయాల్లో ఏం పని అని ప్రశ్నిస్తున్నారు. మాట మీద నిలబడటం కూడా వైసీపీ నేతలకు చేతకాదా అని విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

పోల్స్