Wednesday, February 4, 2026 05:50 PM
Wednesday, February 4, 2026 05:50 PM

గరం గరం గన్నవరం..!

ఏపీలో తొలి నుంచి హాట్ టాపిక్‌గా మారిన నియోజకవర్గాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఇందుకు ప్రధాన కారణం.. అక్కడ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వరుసగా రెండు సార్లు గన్నవరం నియోజకవర్గం నుంచి 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ తన ఆప్తులతో కలిసి వైసీపీలో చేరిపోయారు. ఆ తర్వాత నుంచి గన్నవరం పేరు ప్రతిరోజు వినిపిస్తూనే ఉంది. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పినప్పటికీ.. టీడీపీ నేతలు, అభిమానులు మాత్రం వంశీని విడిచిపెట్టలేదు. అదే సమయంలో సరిగ్గా 2024 ఎన్నికల ముందు యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో.. గన్నవరం టికెట్‌ ఆయనకే కేటాయించారు చంద్రబాబు. దీంతో 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేశారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ హ్యాట్రిక్ విజయం సాధించింది.

Also Read : ఈ ఎస్పీ పేరు చెప్తే గంజాయి బ్యాచ్ కు హడల్..!

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరంలో టీడీపీకి తిరుగే లేదని అంతా అనుకుంటున్న సమయంలో.. టీడీపీలో గ్రూప్ రాజకీయాలకు తెర లేపారు. ప్రధానంగా ఒక వర్గం నేతలను ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పూర్తిగా పక్కన పెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యార్లగడ్డ వెంట వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. నిజానికి యార్లగడ్డ తీరుపై గన్నవరం, బాపులపాడు మండలాలకు చెందిన నేతలు తొలి నుంచి గుర్రుగానే ఉన్నారు. తొలి నుంచి పార్టీలోనే ఉన్న తమకు కనీస గుర్తింపు ఇవ్వటం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న తమపైన వైసీపీ నుంచి వచ్చిన వారు పెత్తనం చేస్తున్నారని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

Also Read : కారు ఇంజిన్ లో కవిత మంటలు.. ఆ మాట ఎందుకు మాట్లాడినట్టు..?

తాజాగా గన్నవరం మండలానికి చెందిన టీడీపీ నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌కు నేరుగా ఫిర్యాదు చేశారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో తొలి నుంచి పార్టీలో ఉన్న వారికి ఎలాంటి గుర్తింపు ఇవ్వటం లేదని ఆరోపించారు. అలాగే మద్యం షాపుల టెండర్ దాఖలులో కూడా పూర్తిగా ఎమ్మెల్యే హవా నడుస్తోందని ఆరోపించారు. టెండర్ వేసేందుకు వెళ్లిన తమపై ఎమ్మెల్యే మనుషులు దాడి చేశారన్నారు. దీనిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లాకు రెండు సార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం రాలేదన్నారు. నేరుగా లోకేష్‌కు తమ గోడు వినిపించేందుకు యత్నించినా కూడా ఆయన వినలేదన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు మా సమస్యలు వినేందుకు సమయం లేదని ఇటీవల విమర్శలు చేస్తున్నారు. యార్లగడ్డ వెంకట్రావు ప్రతి చిన్న విషయంలో కూడా తాను ఖర్చు చేశాను కాబట్టే గెలిచానని.. అంతే తప్ప మీవల్ల కాదనే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పార్టీ పెద్దలు దృష్టి సారించకపోతే.. మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలో టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు కలవరపెడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

పోల్స్