Sunday, March 22, 2026 06:22 AM
Sunday, March 22, 2026 06:22 AM

నోరు విప్పిన నందిగం సురేష్.. ఆందోళనలో వైసీపీ కీలక నేతలు

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయిన వారిలో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా ఒకరు. ఆయన చేసిన పనులు, దారుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే. జగన్ వద్ద ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో అన్ని విధాలుగా రెచ్చిపోయారు సురేష్. ఏదైనా దారుణాలు చేయాలంటే జగన్ కు ఆయనే మొదటి ఆప్షన్ అనే విధంగా పరిస్థితి మారింది. ఈ క్రమంలోనే టీడీపీ ఆఫీస్ పై దాడి బాధ్యతను కూడా సురేష్ కు అప్పగించారు. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు తప్పించుకున్నా ఇప్పుడు మాత్రం టీడీపీ సర్కార్ వదిలిపెట్టలేదు.

హైదరాబాద్ లో దాక్కున్న ఆయన్ను పోలీసులు నిన్న అదుపులోకి తీసుకుని గుంటూరు తీసుకు వచ్చారు. ఆయన ప్రస్తుతం పోలీసుల కష్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే విచారణకు సురేష్ నుంచి ఏ మాత్రం సహకారం అందడం లేదు. దీంతో కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. కార్యాలయంపై దాడికి వెళ్లామని అంగీకరిస్తూనే ఆ సమయంలో తాను అక్కడ లేను అంటూ సురేష్ చెప్పుకొచ్చారు. కాని గూగుల్ లొకేషన్ ఆధారంగా ఆ సమయంలో అక్కడే ఉన్నట్లు పోలీసులు ఆధారాలు చూపించారు.

Read Also : ఏపీ చరిత్రలో ఇదే మొదటిసారి.. అసలేం జరిగింది?

అప్పట్లో ఆయనవద్ద ఉన్న గన్ మెన్ నుంచి కూడా పోలీసులు సాక్ష్యం తీసుకున్నారు. దాడి సమయంలో సురేష్ సంఘటన స్థలంలోనే ఉన్నట్లు వారు చెప్పిన సాక్ష్యం సురేష్ కు పోలీసులు చూపించారు. మీ గన్ మెన్ పేర్లు చెప్పాలని కోరగా.. తనకు తెలియదని, మరచిపోయానని ఎంపీ చెప్పారట. కార్యాలయంపై దాడి ఎన్ని గంటలకు జరిగింది? అప్పట్లో ఎవరెవరు వచ్చారని ప్రశ్నించగా మర్చిపోయా అంటూ సురేష్ బదులు ఇచ్చారు. ఫోన్ అప్పగించాలని కోరగా నిరాకరించారట.

గతంలో వాడిన ఫోన్ ఇటీవల పోయిందని చెప్పడంతో ఫిర్యాదు చేశారా అని పోలీసులు ప్రశ్నించగా.. పాత ఫోనే కదా అని ఫిర్యాదు చేయలేదన్నారట సురేష్. ఇక రిమాండ్ రిపోర్టుపై కూడా సురేష్ సంతకం చేయలేదు. అదే విషయాన్ని పోలీసులు మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్ళారు. సురేష్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దాడి సమయంలో సురేష్ అక్కడ లేరని, బెయిల్ మంజూరు చేయాలని కోరగా మేజిస్ట్రేట్ వారి అభ్యర్థనను తిరస్కరించారు. సీసీ ఫుటేజీలు ఉన్నాయని వారికి వివరించారు. నేడు మరోసారి మాజీ ఎంపీ కస్టడీ పిటిషన్ విచారణ జరగనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్