Monday, October 27, 2025 09:21 PM
Monday, October 27, 2025 09:21 PM
roots

నేపాల్ పరిస్థితి.. పవన్ కీలక ఆదేశాలు

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్ లో చిక్కుకున్న పర్యాటకులు, అక్కడ నివసించే వారికి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వాస్తవానికి బుధవారం అనంతపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులందరూ ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. కానీ నేపాల్ పరిస్థితుల నేపథ్యంలో పలువురు మంత్రులు తిరిగి అమరావతి చేరుకున్నారు.

Also Read : అతనికి ఇప్పుడైనా ఛాన్స్ వస్తుందా..? గంభీర్ కరుణిస్తాడా..?

ఉదయం మంత్రి నారా లోకేష్ ఆర్టిజిఎస్ కార్యాలయానికి చేరుకుని సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహించి పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక ఆ తర్వాత హోం మంత్రి అనిత కూడా సచివాలయానికి చేరుకుని అధికారులను అడిగి పరిస్థితి తెలుసుకున్నారు. ఇదే సమయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను అప్రమత్తం చేశారు.

Also Read : ఏదైనా బావిలో దూకి చావండి..!

కందుల దుర్గేష్ అనంతపురం పర్యటన కోసం వెళ్లగా వెంటనే విజయవాడ వెళ్లాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగా అధికారులతో సమన్వయం చేసుకొని అక్కడ చిక్కుకున్న పర్యాటకులతో పాటుగా ఇతర పౌరులను రక్షించాలని పవన్ కళ్యాణ్ మంత్రికి సూచించారు. రాత్రి అనంతపురం చేరుకున్న మంత్రి దుర్గేష్ పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తిరిగి విజయవాడ బయలుదేరారు. ప్రస్తుతం నేపాల్ లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అటు ప్రభుత్వం కూడా రాజీనామా చేయడంతో ఆర్మీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్