ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు తప్పించేలా కొత్త రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతామని అన్నారు. పోరాట యాత్రలప్పుడు పాడేరు, అరకు గిరిజన ప్రాంతాల్లో తిరిగినట్టు చెప్పారు పవన్. రోడ్లు, తాగునీటి కొరత, యువతకు ఉపాధి లేని విషయాన్ని గుర్తించాను అన్నారు. అటవీ ప్రాంతాల్లో అద్బుతమైన సౌందర్యం ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 670 కోట్లు వస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
మేం డబ్బులు లేకున్నా…. కొండ ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నామన్నారు. రుషి కొండకు 500 కోట్లు ఖర్చు పెట్టాడు కానీ ఇక్కడ 9 కోట్ల తో రోడ్లు వేయలేకపోయారని ఆరోపించారు. ఒక కిలో మీటర్ దూరం నడిస్తే కానీ గిరిజనుల సాధక బాధలు తెలియవని నడిచి వచ్చాను అన్నారు పవన్. నా కష్టాలు తీర్చమని తిరుమల కొండ ఎక్కానన్న పవన్ ఇప్పుడు ఈ కొండ ఎక్కా గిరిజనుల కష్టాలు తీర్చమని రోడ్డు వేసేలోగా….కనీసం మనుషులు నడిచేందుకు వీలుగా చదును చేయాలని ఇప్పుడే ఆదేశించాను అన్నారు పవన్.
Also read : కాకినాడ పోర్ట్ కేసు.. వైసీపీ నేతలకు ఉచ్చు బిగించిన ఈడీ…!
గిరిజనలను చూస్తే నాకు అసూయగా ఉందన్నారు పవన్. ఇంత చక్కటి ప్రకృతి మద్య మీరు బతుకుతూ నాకు అసూయ కలిగిస్తున్నారన్నారు పవన్. నాకు గుడి కట్టొద్దు…బడి కావాలన్నారు. మన్యంలో డోలీ మోతలు తప్పించడానికి 40 కోట్లతో 19 రోడ్లు మంజూరు చేశామన్నారు. భవిష్యత్ లో 350 కోట్లతో మన్యంలో అన్ని పంచాయతీలన్నీ కలుపుతూ రోడ్లు వేస్తామని తెలిపారు. బుగ్గలు నిమరడం, తల నిమరడం నాకు తెలియదన్నారు పవన్. మీ కన్నీళ్లు చూసి పారిపోనని స్పష్టత ఇచ్చారు. ఐ లవ్ యు అంటూ గిరిజనులకు చెప్పారు పవన్. నా పిల్లలకు కూడా మీకు చెప్పినన్ని సార్లు ఐ లవ్ యూ చెప్పలేదన్నారు. మాట ఇచ్చాను…. రెండు నెలలకోసారి రెండ్రోజులపాటు మన్యం అంతా తిరుగుతాను అన్నారు పవన్.

