మోంథా తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కేంద్ర బృందాలతో పాటుగా రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు ఇప్పటికే.. క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాయి. ఎప్పటికప్పుడు మంత్రులు జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ.. ఆదేశాలు ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా పర్యటిస్తూ, అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అధికారులతో స్వయంగా మాట్లాడుతున్నారు.
Also Read : బెజవాడలో అఖండ తాండవం.. క్రేజీ అప్డేట్..!
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కుటుంబంలో శుభకార్యాన్ని పక్కన పెట్టగా.. ఇక పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాలో నెలకొన్న పరిస్థితులను.. పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ సముద్రతీరంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో అక్కడ అధికారులతో పవన్ స్వయంగా మాట్లాడారు. అలాగే జనసేన పార్టీ నాయకులను క్షేత్రస్థాయిలో పర్యటించే దిశగా ఆదేశాలు ఇచ్చారు.
Also Read : తప్పుడు ఆరోపణలు.. వాస్తవాలు..!
అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశించిన పవన్.. ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదం ఉంది కాబట్టి అవసరమైతే అక్కడున్న ప్రజలను బలవంతంగా అయినా సరే పునరావస కేంద్రాలకు తరలించాల్సిందేనని పవన్ ఆదేశించారు. ఇక సముద్ర తీర ప్రాంతాల్లో దండోరాలు వేయించాలని, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్ల సహకారం తీసుకోవాలని పవన్ సూచించారు. రాజకీయాలను పక్కనపెట్టి అందరూ ప్రజల కోసం ముందుకు రావాలని ఆదేశించారు పవన్. ఇక పవన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

