Sunday, March 22, 2026 12:54 PM
Sunday, March 22, 2026 12:54 PM

టీడీపీ తో పొత్తుపై పవన్ కీలక కామెంట్స్

ఈ మధ్యకాలంలో ప్రభుత్వంపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్న.. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. పరిపాలన విషయంలో ఎన్నడూ లేనివిధంగా సమీక్ష సమావేశాలు, అధికారులతో కీలక చర్చలు, ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో జోక్యం.. వంటివి పవన్ దూకుడు గానే నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా పెరవలిలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అంశం గురించి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. టిడిపితో పొత్తు అంశానికి సంబంధించి కార్యకర్తల్లో ఉన్న అనుమానాలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.

Also Read : లోకేష్‌కు ఇప్పట్లో ఆ ఆలోచన లేనట్లే..!

తెలుగుజాతి, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే ఏకమయ్యామని.. రెబన్న భావజాలం గల పార్టీల నుంచి వచ్చి ఒకటయ్యామన్నారు. ఒకే కుటుంబం దిశగా అందరూ ఆలోచించామన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ఐదు జిల్లాల పరిధిలో 7900 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపిన పవన్ కళ్యాణ్.. ఈ ప్రాజెక్టు ద్వారా 1.2 కోట్ల మంది దాహార్తి తీర్చేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ తీరప్రాంతాలు కలిపే లక్ష్యంతో ప్రాజెక్టు రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు పవన్. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతున్నట్లు తెలిపారు.

Also Read : చెవిరెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డి.. నలిగిపోతున్న జగన్..!

బూర్గుల రామకృష్ణారావు, పొట్టి శ్రీరాములు ఎప్పుడు తన గుండెల్లో ఉంటారని చెప్పుకొచ్చారు. పదేళ్లు పార్టీ పెట్టీ కూడా తను వెనక్కు తగ్గానని.. సీట్లు అమ్ముకున్నానని తనను విమర్శించారన్నారు. ప్రజల కోసం సీట్లు తగ్గించుకున్నట్లు తెలిపారు పవన్. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన బూర్గుల, పొట్టి శ్రీరాములు తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం పైన మాత్రమే దృష్టి పెట్టిందని.. చెడు రాజకీయాలు చేసేవారికి అదే స్థాయిలో సమాధానం చెబుతామన్నారు. నాయకులు అందరూ కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని, ప్రజలను సంతృప్తి పరచగలమన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్