Wednesday, February 4, 2026 07:38 PM
Wednesday, February 4, 2026 07:38 PM

ఏం చేస్తున్నారు..? ఎమ్మెల్యేలపై జనసేనాని ఫోకస్..! 

ఏపీలో జనసేన పార్టీ బలోపేతం సంగతి ఏంటి..? ఆ పార్టీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఇదే ప్రశ్న వినపడుతూ ఉంటుంది. రాజకీయంగా ప్రస్తుతం జనసేన పార్టీ కొంత బలంగానే కనపడుతున్నప్పటికీ.. అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పార్టీని అధినేత పవన్ కళ్యాణ్ ఎంత వరకు బలోపేతం చేస్తున్నారనేది ప్రధాన ప్రశ్న. 2014లో పార్టీని స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా పూర్తిగా జనసేన పార్టీ బలోపేతం కాలేదు. అభిమానులే గాని కార్యకర్తలు ఆ పార్టీకి కనబడటం లేదు. మరి దీనిపై పవన్ ఎటువంటి అడుగులు వేయబోతున్నారు..?

Also Read : ఈ ఎస్పీ పేరు చెప్తే గంజాయి బ్యాచ్ కు హడల్..!

దీనికి సంబంధించి ఎన్నో సందర్భాల్లో చర్చలు జరిగినప్పటికీ బలమైన అడుగులు మాత్రం పడలేదు. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు పవన్ సిద్ధమయ్యారు. ముందు తాము గెలిచిన 21 ఎమ్మెల్యే, మూడు ఎంపీ స్థానాల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ సహకారం ఉన్నప్పటికీ.. ఆ పార్టీతో పొత్తు ఉన్న లేకపోయినా, ఈ 21 స్థానాలలో పార్టీ పూర్తిగా బలోపేతం కావాలని పవన్ పట్టుదలగా అడుగులు వేస్తున్నారు. 2024 ఎన్నికల్లో అభ్యర్థుల లేక తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నాయకులు కొందరిని పార్టీలో చేర్చుకుని సీట్లు ఇచ్చిన పరిస్థితులు చూసాం. భవిష్యత్తులో ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి.. కొత్త నాయకత్వాన్ని మండల స్థాయిలో తీసుకురావాలని పవన్ అడుగులు వేస్తున్నారు.

Also Read: గరం గరం గన్నవరం..!

కూటమి ద్వారా అధికారం పంచుకోవడం అనేది ఎప్పటికీ మంచిది కాదు అనే భావనలో ఉన్న పవన్.. సొంతగా పార్టీని బలోపేతం చేస్తే, ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడమే కాకుండా.. ప్రభుత్వంలో భాగం కాగలిగితే మరింత పట్టు పెంచుకోవచ్చని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేలతో వరుసగా బేటీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో ఎమ్మెల్యే పార్టీ బలోపేతానికి నియోజకవర్గంలో ఏం చేశారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులను ఎంతవరకు సద్వినియోగ పరుస్తున్నారు, జనసేన వద్ద ఉన్న శాఖలపై ప్రజల్లో ఎంతవరకు సానుకూలత ఉంది, కూటమిలోని మిగిలిన రెండు పార్టీల నుంచి సహకారం ఎలా ఉంది..? వంటి అంశాలపై పవన్ ఇప్పుడు ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకోనున్నారు.

 

కుల రాజకీయాలను వ్యతిరేకించే పవన్ కళ్యాణ్.. కొంత కాపు ముద్ర నుంచి బయటికి రావాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అందుకే అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేదిశగా అడుగులు వేస్తున్నారు పవన్. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలను ప్రోత్సహించాలని పార్టీ నాయకత్వానికి పవన్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీనిపై కూడా ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకునే దిశగా సమీక్షలు జరుపుతున్నారు. అలాగే అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్న వారికి కూడా పవన్ నేరుగా వార్నింగ్ ఇవ్వనున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్