Saturday, March 21, 2026 10:48 PM
Saturday, March 21, 2026 10:48 PM

కమ్మిన్స్ దెబ్బ హైదరాబాద్ కు గట్టిగానే..?

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. స్టార్ పేసర్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌ లకు దూరం కావడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లిన ఘనత ప్యాట్ కమిన్స్‌ ది. కేవలం బౌలర్‌ గానే కాకుండా, కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించిన కమిన్స్ లేకపోవడం హైదరాబాద్ జట్టుకు పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు. కమిన్స్ స్థానంలో ఇషాన్ కిషన్ తాత్కాలిక కెప్టెన్‌ గా బాధ్యతలు చేపట్టాడు.

Also read : పాక్ బోర్డుపై బంగ్లాదేశ్ రివేంజ్ ప్లాన్..?

అయితే, ఇషాన్‌ కు ఐపీఎల్ స్థాయిలో కెప్టెన్సీ చేసిన అనుభవం తక్కువ. క్లిష్ట సమయాల్లో కమిన్స్ తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు జట్టుకు అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇషాన్ ఆ ఒత్తిడిని ఎలా తట్టుకుంటాడో చూడాలి. ఒక బౌలర్ కెప్టెన్‌ గా ఉంటే ఇతర బౌలర్ల పని ఈజీ అవుతోంది. ఇప్పుడు బ్యాటర్ అయిన ఇషాన్ బౌలింగ్ మార్పులను ఎలా చేస్తాడో అన్నది ఆసక్తికర అంశం. ఇక కొత్త బంతితో వికెట్లు తీయడంలో, అలాగే చివరి ఓవర్లలో పరుగులను కంట్రోల్ చేయడంలో కమిన్స్ దిట్ట.

Also read : టీటీడీలో కమాండ్ కంట్రోల్.. అసలు ఎలా పని చేస్తుందంటే..?

కమ్మిన్స్ లేకపోతే లేకపోతే భువనేశ్వర్ కుమార్ లేదా నటరాజన్‌ పై భారం పెరిగే ఛాన్స్ ఉంది. కమిన్స్ స్థానంలో మరో విదేశీ బౌలర్‌ ను తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల బ్యాటింగ్‌ లో మార్కో జాన్సెన్ లేదా ట్రావిస్ హెడ్ వంటి వారిలో ఒకరిని పక్కన పెట్టే అవకాశం ఉంది. వైస్ కెప్టెన్‌ గా కొత్త బాధ్యతలు చేపట్టిన.. అభిషేక్ శర్మ ఇప్పుడు ఇషాన్‌ కు అండగా నిలవాలి. ఫీల్డ్ సెట్టింగ్‌ లో, బౌలింగ్ మార్పుల్లో అభిషేక్ సలహాలు జట్టుకు కీలకం కానున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్