ఇరాన్ – అమెరికా మధ్య కుదిరిన 15 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించామన్న అత్యుత్సాహం పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాల ముందు నవ్వులపాలు చేసింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ఒక చిన్న సోషల్ మీడియా పొరపాటు ఇప్పుడు ఆ దేశ దౌత్య సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కుదిరిందని ప్రకటించే క్రమంలో ప్రధాని షరీఫ్ తన ఎక్స్ ఎకౌంటు లో ఒక పోస్ట్ చేశారు.
Also Read : పంతం నెగ్గించుకున్న ఇరాన్.. లాస్ట్ మినిట్ తగ్గిన ట్రంప్..!
అయితే, ఎవరో రాసిచ్చిన డ్రాఫ్ట్ ను అలాగే కాపీ చేసి పేస్ట్ చేయడంతో, పైన ఉండాల్సిన “Draft message for PM on X” అనే లైన్ ను కూడా తొలగించడం మర్చిపోయారు. దీంతో నెటిజన్లు సొంతంగా ఒక ట్వీట్ కూడా రాయలేని వ్యక్తి దేశాన్ని ఎలా నడుపుతారు..? అంటూ పాక్ ప్రధానిని కామెడీ పీస్ అని ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు, ఈ ఒప్పందంలో పాకిస్తాన్ పాత్రపై ఇరాన్ చాలా వ్యంగ్యంగా రియాక్ట్ అవుతోంది. తాము చర్చలు జరిపింది అమెరికాతోనే అని, మధ్యలో పాకిస్తాన్ కేవలం ఒక మెసెంజర్ లేదా కొరియర్ బాయ్ లాగా పని చేసిందని ఇరాన్ దౌత్య వర్గాలు పరోక్షంగా వ్యాఖ్యానిస్తున్నాయి.
Also Read : షాకింగ్.. బెజవాడ ఉగ్ర లింకుల్లో భారీగా అమ్మాయిలు..!
ముఖ్యంగా, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ విధిస్తున్న ఆంక్షలు మరియు టోల్ ఫీజుల విషయంలో పాకిస్తాన్ జోక్యం చేసుకోవడాన్ని ఇరాన్ ఏమాత్రం ఇష్టపడటం లేదు. తమ దేశ ఆర్థిక వ్యవస్థనే చక్కదిద్దుకోలేని వారు, అంతర్జాతీయ వాణిజ్యం గురించి మాకు సలహాలు ఇవ్వనక్కర్లేదు అనే అర్థం వచ్చేలా ఇరాన్ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. నిజానికి పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నప్పటికీ, అసలు కథ నడిపింది డొనాల్డ్ ట్రంప్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ విధించిన షరతులకు లొంగి, తన ఉనికిని కాపాడుకోవడానికి పాకిస్తాన్ పాకులాడుతోందని ఇరాన్ భావిస్తోంది. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో జరగబోయే చర్చలకు ముందే పాకిస్తాన్ ఇమేజ్ ఇలా డ్యామేజ్ అవ్వడం ఆ దేశానికి పెద్ద మైనస్ గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

