Monday, October 27, 2025 11:57 PM
Monday, October 27, 2025 11:57 PM
roots

పాకిస్థాన్ దాడులు.. తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం..?

జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత దేశంలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. పాకిస్తాన్ పై భారత్ యుద్ధానికి దిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాకిస్తాన్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. త్రివిధ దళాల అధిపతులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఎప్పుడూ ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కాక జాతీయ మీడియా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Also Read : గంటా సమస్యకు దొరికిన పరిష్కారం..!

అటు ప్రపంచ దేశాలు కూడా మోడీ నిర్ణయం పై ఏం జరగబోతోంది అంటూ ఆసక్తిగా తిలకిస్తున్నాయి. ఇక కేంద్ర హోం శాఖతో పాటుగా రక్షణ శాఖ సరిహద్దుల్లో భద్రత విషయంలో కఠినంగానే ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి కొరియర్ సర్వీసులను కూడా ఇటీవల నిలుపుదల చేశారు. విమాన సర్వీసులను కూడా భారత్ మూసివేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పాకిస్తాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు పంపింది. పలు రాష్ట్రాలపై పాకిస్తాన్ తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

Also Read : తమ్ముడిపై కేశినేని నానీ మరో బాంబు 

భారత్ పాకిస్తాన్ పై యుద్ధానికి దిగితే మాత్రం పాకిస్తాన్ దాడి చేసే ప్రాంతాలను భారత్ గుర్తించింది తాజాగా కేంద్ర హోంశాఖ వివరాల ప్రకారం దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ప్రకటించారు. మూడు కేటగిరీలుగా ప్రభావిత ప్రాంతాలను విభజించారు. క్యాటగిరి 1 లో దేశ రాజధాని ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం కూడా ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కేటగిరీ 2 లో ఉన్నాయి. హైదరాబాద్ తో పాటుగా విశాఖను క్యాటగిరి టు లో చేర్చారు. మొత్తం దేశవ్యాప్తంగా 20059 జిల్లాల్లో యుద్ధ ప్రభావం ఉంటుందని అంచనా వేసింది కేంద్ర హోం శాఖ. ఈ ప్రాంతాలకు భారత ఆర్మీని తరలించాలని నిర్ణయించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్