Wednesday, February 4, 2026 06:09 PM
Wednesday, February 4, 2026 06:09 PM

ఉగ్రవాదులకు బరా బర్ మద్దతు ఇస్తాం.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన కామెంట్స్

ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ వైఖరి మాత్రం మారడం లేదు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో అక్కడి నాయకులు, ఆర్మీ అధికారులు భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తాజాగా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ సంచలన కామెంట్స్ చేసారు. మదర్సాలో చదువుకున్న జనరల్ ఆసిఫ్ మునీర్.. బహిరంగంగా ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చాడు. శనివారం పాకిస్తాన్ నావల్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో ప్రసంగించిన జనరల్ అసిమ్ మునీర్ చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి.

Also Read : తిరుపతిలో భయపెడుతున్న గంజాయి గ్యాంగ్ లు..

జమ్మూ కాశ్మీర్‌లో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులకు నిస్సంకోచంగా మద్దతు ఇచ్చిన అతను.. భారత్ లో జరిగే ఉగ్రవాద దాడులు చట్టబద్దమైన పోరాటంగా అభివర్ణించాడు. కాశ్మీరీ ఉగ్రవాదులకు పాకిస్తాన్ రాజకీయ, దౌత్య మరియు నైతిక మద్దతును అందిస్తూనే ఉంటుందని స్పష్టం చేసాడు. భారత్.. పాకిస్తాన్‌పై రెండుసార్లు ఎటువంటి హెచ్చరికలు లేకుండా దురాక్రమణ చర్యలకు పాల్పడిందని మండిపడ్డాడు. భవిష్యత్తులో ఏదైనా ఉద్రిక్తత తలెత్తితే దాని బాధ్యత భారత్ దే అంటూ హెచ్చరించాడు.

Also Read : తెలుగు సైనికుడి జీవిత కథతో సల్మాన్ సినిమా

వ్యక్తిగత ఎజెండా తో అతను ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని భావిస్తున్నారు పరిశీలకులు. తన దేశ రక్షణపై దృష్టి సారించి, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఉగ్రవాదులతో పోరాడటానికి బదులుగా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భారత్ ను రెచ్చగొట్టడానికి కారణం ఏమై ఉండవచ్చు అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ పాత్ర మరోసారి బయటపడిన తర్వాత కూడా, అతను ఉగ్రవాదులకు బహిరంగంగా ఎందుకు మద్దతు ఇస్తున్నాడు? అనేది మరో ప్రశ్న.

Also Read : అదరగొట్టిన హైదరాబాద్ నవాబ్.. న్యూ బాల్ కింగ్

షాబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన ఇష్టాయిష్టాలకు లొంగిపోయేలా అతి జాతీయవాదం అంశాన్ని లేవనెత్తడం అతని వ్యూహంగా భావిస్తున్నారు. దీని ద్వారా సైన్యంపై తన నియంత్రణను శాశ్వతం చేసుకునే ఎజెండాపై అసిమ్ మునీర్ పనిచేస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి మరో కారణం కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్న సమయంలో, భారత వ్యతిరేక లాబీని తన వైపు ఉంచుకుని, తన దళాలకు మరిన్ని నిధులు డిమాండ్ చేస్తూ ఉండాలని కూడా అతను వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడబనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

పోల్స్