Wednesday, February 4, 2026 02:33 PM
Wednesday, February 4, 2026 02:33 PM

బీజేపీలో దొంగలు పడ్డారు.. కోవర్టుల గోల..!

భారతీయ జనతా పార్టీ.. ప్రస్తుతం అత్యంత బలమైన పార్టీగా ముద్ర పడింది. వరుసగా మూడుసార్లు మోదీ సారధ్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో కనీసం సభ్యత్వం కూడా లేని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు గెలిచే స్థాయికి ప్రస్తుతం ఆ పార్టీ చేరుకుంది. ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఉత్తరాధిలో అన్ని రాష్ట్రాల్లో అధికారం చెలాయించిన బీజేపీ.. దక్షిణాధిలో కూడా అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటకలో బలంగానే ఉన్న బీజేపీ.. ఏపీలో టీడీపీ, జనసేన పార్టీల పొత్తుతో అధికారంలో ఉంది. తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ సారధ్యంలోని బీజేపీ.. దాదాపు గెలిచినంత పని చేసింది. అయితే అప్పట్లో బీఆర్ఎస్, ఎంఐఎం చేతులు కలపడంతో బీజేపీకి మేయర్ పదవి దక్కలేదు.

Also Read : డ్రగ్స్ లో దొరికిపోయిన స్టార్ హీరోయిన్ తమ్ముడు..?

ఇక తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పెద్దలు అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. అటు బీఆర్ఎస్‌తో, ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపైన బీజేపీ నేతలు పెద్ద యుద్ధం చేశారు. 2018 ఎన్నికల్లో కేవలం ఒకటే ఎమ్మెల్యే సీటు గెలిచిన బీజేపీ.. 2023 ఎన్నికల్లో ఏకంగా 8 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. కామారెడ్డి నియోజకవర్గంలో అయితే కేసీఆర్, రేవంత్ రెడ్డిని కాదని బీజేపీ అభ్యర్థి రమణారెడ్డి విజయం సాధించారు. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ తన సత్తా చాటింది. 8 పార్లమెంట్ స్థానాలు సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. అయితే తాజాగా బీజేపీ నేతల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, జి.నగేష్ వంటి హేమాహేమీలు గెలిచారు. కానీ ఇప్పటి వరకు బీజేపీ నేతల మధ్య సరైన సఖ్యత లేదనే మాట బాగా వినిపిస్తోంది.

బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. డీకే అరుణకు పార్టీ జాతీయ స్థాయి పదవి దక్కింది. ఇక ఈటల రాజేందర్‌, ధర్మపురి అరవింద్‌లలో ఒకరికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు దక్కుతాయని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రామచందర్ రావు పేరును ఢిల్లీ పెద్దలు ప్రకటించారు. దీంతో పార్టీలో ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. నేనెందులో తక్కువ అంటే నాకేం తక్కువ అంటూ సీనియర్లు సిగపట్లు పట్టుకుంటున్నారు. పైకి మాత్రం అంతా కలిసే ఉన్నట్లు కనిపిస్తున్నా.. లోపల మాత్రం ఒకరిపై ఒకరు రాజకీయాలు చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఇటీవల తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీ ఎంపీలపై ప్రశంసల జల్లు కురిపించిన ప్రధాని.. తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీపైన, కేంద్రం పైన వస్తున్న ఆరోపణలు కూడా తిప్పికొట్టలేక పోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలా అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా.

Also Read : దమ్ముంటే మోడీని, అమిత్ షా ని అరెస్ట్ చేస్తానని ప్రకటించగలవా?

నిజానికి ఈ సమావేశం పూర్తి ఏకాంతంగా జరిగింది. కానీ ఈ భేటీలో ప్రధాని ఆగ్రహం అనే విషయాలు ఆ వెంటనే మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇది ఎవరు చేశారనే అంశంపై బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నారు. పార్టీలోని కొందరు నేతలే ఈ మ్యాటర్ లీక్ చేశారనేది ప్రధాన ఆరోపణ. నిజానికి తెలంగాణలో బీజేపీలో నేతల మధ్య ఏ మాత్రం సఖ్యత లేదు అనేది వాస్తవం. ఇందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఈ ఎన్నిక ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఉంటుందని తొలి నుంచి అంతా వ్యాఖ్యానిస్తున్నారు. అయినా సరే.. బీజేపీ నేతలు మాత్రం చాలా లైట్ తీసుకున్నారు. ఒకరిద్దరు మాత్రం ఏదో మొక్కుబడిగా బీజేపీ అభ్యర్థి తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారు. అందుకే ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే.. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి పది లోపే స్థానాలు వస్తాయనే మాట బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్