Wednesday, February 4, 2026 07:43 PM
Wednesday, February 4, 2026 07:43 PM

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కు ఆ హడావుడి ఎక్కడ..?

భారత్ – వర్సెస్ పాకిస్తాన్ అనగానే హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది. క్రికెట్ అయినా ఏ పోటీ అయినా సరే రెండు దేశాల అభిమానుల సందడి పీక్స్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆసియా కప్ లో హడావుడి కనపడటం లేదు. రెండు దేశాల మధ్య జరగబోతున్న హైవోల్టేజ్ టి20 మ్యాచ్ కు అసలు సందడి కరువైంది. కనీసం మైదానంలో టికెట్ లు కూడా పూర్తిగా బుక్ కాలేదనే వార్త కలవరపెడుతోంది. 40 శాతం టికెట్ లు ఇంకా అన్ సొల్ద్ అంటూ జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Also Read : మెగా ఫ్యాన్స్ కు 18 ఇయర్స్ గిఫ్ట్ రెడీ

ఇటు సోషల్ మీడియాలో కూడా ఈ పోరు గురించి పెద్దగా హడావుడి లేదనే చెప్పాలి. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా అన్ని రకాల మీడియాను షేక్ చేసింది ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్. అయితే ఆసియా కప్ లో ఆ రేంజ్ బజ్ లేకపోవడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య క్రికెట్ వద్దనే డిమాండ్ లు వినిపించాయి. ద్వైపాక్షిక పోరు మాత్రమే కాదు, మెగా టోర్నీలలో కూడా వద్దని కోరారు ఫ్యాన్స్. అటు మాజీ క్రికెటర్లు ఆడిన లీగ్ లో కూడా భారత ఆటగాళ్ళు మ్యాచ్ ను బాయ్ కాట్ చేసారు.

Also Read : టార్గెట్ పంచాయితీ.. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు..!

ఇప్పుడు యువ ఆటగాళ్ళు కూడా అలాగే బాయ్ కాట్ చేయాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్ ఉంది. దానికి తోడు సీనియర్ ఆటగాళ్ళు లేకపోవడం కూడా మైనస్ అయింది. గత 15 ఏళ్ళలో భారత్ – పాకిస్తాన్ పోరు అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా లేదు. కాని ఈసారి మాత్రం ఆ ఇద్దరూ లేరు. దీనితో మ్యాచ్ కు పెద్దగా హడావుడి జరగడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఇద్దరూ ఉండటంతో ఫ్యాన్స్ మైదానానికి క్యూ కట్టారు. ఏది ఏమైనా ఆసియా కప్ మాత్రం ఈసారి చప్పగానే సాగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్