తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు తెలుగుదేశం పార్టీ రాజకీయం మొదలు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఎన్డీఏ పెద్దలు ఇప్పుడు.. తెలంగాణలో జరగబోయే మున్సిపల్, పరిషత్ ఎన్నికలపై గట్టి ఫోకస్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సైతం భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి. 2024 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ ఈసారి మాత్రం పక్క ప్లానింగ్ తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై తన సత్తా చాటేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది.
Also Read : అమరావతిపై కేంద్ర కేబినెట్ కీలక అడుగులు..!
ఇందుకోసం కీలకంగా భావించే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపిస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటుంది. అందుకే పార్టీ బలహీనంగా ఉన్న నల్గొండ ఖమ్మం జిల్లాలపై ఎక్కువగా దృష్టి సారించింది కమలం పార్టీ. త్వరలో హైదరాబాద్ తో పాటుగా నల్గొండ, ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభలను నిర్వహించే ప్రణాళిక సిద్ధం చేస్తుంది. మెదక్, నల్గొండ సరిహద్దుల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే దిశగా ప్లానింగ్ ఇప్పటికే వర్కౌట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దుల్లో మరో బహిరంగ సభ దిశగా అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత ఈ సభలు ఉండే అవకాశం ఉంది.
Also Read : దావోస్‌లో ‘టీమ్ ఏపీ’ దూకుడు.. రాష్ట్రానికి లక్ష కోట్ల పెట్టుబడులు
ఇక ఇక్కడి నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటుగా నియోజకవర్గాల ఇన్చార్జిలు, పార్లమెంటరీ కమిటీల నియామకాలను పూర్తి చేయాలని టిడిపి అధిష్టానం భావిస్తోంది. జనసేన పార్టీ సైతం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేసే దిశగా అడుగులు వేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని అడుగులు వేస్తున్నారు. ఇక్కడ గులాబీ పార్టీ క్రమంగా బలహీన పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ కూటమిని తీసుకువెళ్లాలని బిజెపి అడుగులు వేస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో బిజెపి.. టిడిపి, జనసేన పార్టీల సహకారం కోరుతున్నట్లుగా తెలుస్తోంది.

