మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. మాస్ ఆడియన్స్ కు చిరంజీవి బాగా దగ్గరైన హీరో. అందుకే దర్శకులు కూడా మాస్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రిలీజ్ కాబోతున్న చిరంజీవి సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా విషయంలో చిరంజీవి కూడా గట్టిగానే వర్క్ చేశారు. ఈ మధ్యకాలంలో చిరంజీవి సినిమా లేక ఇబ్బంది పడుతున్న ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ జోష్ ఇవ్వడం ఖాయమని సినిమా అనలిస్టులు కూడా అంచనా వేస్తూ వచ్చారు.
Also Read : మోదీ తర్వాత ప్రధాని పదవి ఎవరికో తెలుసా..?
అయితే ఇప్పుడు సినిమా నిర్మాతలను ఓ విషయం భయపెడుతోంది. సినిమా విషయంలో ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆగ్రహం గానే ఉన్నారు. దేవర సినిమా విషయంలో మెగా ఫాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. కొరటాల శివ పై ఉన్న కోపాన్ని ఈ సినిమాపై చూపించారు. ఇక నందమూరి ఫ్యాన్స్ కూడా బాలకృష్ణ విషయంలో చిరంజీవి ఫ్యాన్స్ చేసిన ఓవరాక్షన్ పై సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. అఖండ సీక్వెల్ విషయంలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. దీనితో ఇప్పుడు చిరంజీవి సినిమాను ఓ రేంజ్ లో ఆడుకోవడానికి నందమూరి ఫ్యాన్స్ ఏకమైనట్లు తెలుస్తోంది.
Also Read : వైసీపీ క్యాడర్ లో కేసీఆర్ జోష్.. పండగే..!
సోషల్ మీడియా వేదికగా రివేంజ్ ప్లాన్ ఓ రేంజ్ లో ఉండేటట్లు ప్లాన్ చేసుకున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఇప్పటినుంచి ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఇప్పటికే సినిమాలోని పాటలతో పాటుగా కొన్ని సన్నివేశాలను ఒక ఆట ఆడుకుంటున్నారు. చిరంజీవి లుక్స్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉన్న నందమూరి ఫ్యాన్స్ మధ్య ఇప్పుడు చిరంజీవి సినిమా గురించి చర్చ జరుగుతోంది. ఈ సినిమా కలెక్షన్స్ పై కూడా ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు నందమూరి ఫ్యాన్స్. సినిమా కలెక్షన్లను మొదటి రోజులలో భారీగా చెప్పుకుంటూ ఉంటారు దర్శకులు నిర్మాతలు. కానీ ఇప్పుడు వాటిపై కూడా ట్రోల్ చేసేందుకు రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. అటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చిరంజీవి విషయంలో కాస్త సీరియస్ గానే ఉంటారు. దీనితో వాళ్లు కూడా ఈ సినిమాను టార్గెట్ చేసే ఛాన్స్ కనబడుతోంది.

