Tuesday, October 28, 2025 06:55 AM
Tuesday, October 28, 2025 06:55 AM
roots

దుమ్ము రేపిన బాలయ్య.. షేక్ చేస్తున్న అఖండ తాండవం

“అఖండ” నందమూరి బాలకృష్ణ సినీ జీవితంలో ఓ సంచలనం. అప్పటి వరకు బాలకృష్ణ స్థాయి వేరు అక్కడి నుంచి మారిన రేంజ్ వేరు. ఆ సినిమాలో బాలయ్య నటనతో పాటుగా డైరెక్షన్ కూడా అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేసాయి. హింస ఎక్కువగా ఉన్నా సరే సినిమాలో బాలయ్య డైలాగులు, ఆయన లుక్స్ బాగా ఆకట్టుకున్నాయి. అక్కడి నుంచి బాలయ్య చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం బాలయ్య అఖండ సీక్వెల్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది దసరాకు రిలీజ్ కానుంది.

Also Read : అఖండ2 తాండవం టీజర్

ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ప్రస్తుతం హిమాలయాల్లో సినిమా షూటింగ్ జరుగుతోంది. తాజాగా సినిమా గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేయగా దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మంచు కొండల్లో గడ్డంతో బాలయ్య లుక్స్ కు ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను కూడా తమన్ అదే రేంజ్ లో ఇచ్చాడు. అఖండ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అయింది. ఈ సినిమాకు కూడా తమన్ వర్క్ చేస్తుండటంతో అంచనాలు పెరిగాయి.

Also Read : అది సంకర జాతి కాదా సజ్జల..?

బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన వీడియోలో.. త్రిశూలం షాట్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీనిపై సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హడావుడి చేస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించి ఇక్కడి నుంచి క్రేజీ అప్డేట్స వచ్చే ఛాన్స్ కనపడుతోంది. మహా కుంభమేళలో షూట్ చేసిన వాటికి సంబంధించిన లుక్స్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సినిమాలో విలన్ ఎవరు అనేది చెప్పకపోయినా ఖచ్చితంగా.. ఆది పినిశెట్టి అనేది క్లియర్ గా అర్ధమైంది. దసరాకు ఈ సినిమా రిలీజ్ కానుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్