నా అన్వేషణ.. యూట్యూబ్ లో టూరిస్ట్ వీడియోలు చూసే అందరికి సుపరిచితమైన పేరు. పాతిక లక్షల మంది ఫాలోవర్స్ తో ఓ రేంజ్ డామినేషన్ కంటిన్యూ చేసే అన్వేష్ అనే ఉత్తరాంధ్ర యువకుడికి ఇతర దేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే అతనికి స్వాగతం పలికే వారి సంఖ్య భారీగానే ఉంది. అయితే ఇటీవలి కాలంలో అతను మాట్లాడుతున్న మాటలపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల శివాజీ.. చీర గురించి కామెంట్ చేసిన తర్వాత.. ఇతను ఆ కామెంట్స్ తప్పుబట్టాడు.
Also Read : బులుగు కార్యకర్తల్లో ఉగ్ర లక్షణాలు..? ఇస్లామిక్ స్టేట్ ను గుర్తు చేస్తున్న చేష్టలు..!
అక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ.. తీవ్ర అభ్యంతరకరంగా మాట్లాడటంపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ప్రవచనకర్త గరికపాటిపై కూడా విమర్శలు చేసాడు. వ్యక్తిగత కామెంట్స్ చేస్తూ విమర్శలు చేసాడు. ఇక అక్కడి నుంచి అతనికి షాక్ ఇవ్వడం మొదలుపెట్టారు తెలుగు వాళ్ళు. ఒక్క రోజులో దాదాపు 70 వేల మంది ఫాలోవర్స్ తగ్గిపోయారు. దానికి తోడు రిపోర్ట్స్ కొట్టడం కూడా మొదలుపెట్టారు. ఇదే సమయంలో.. అతను లైవ్ లో మాట్లాడుతూ.. భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడాడు.
Also Read : సినిమా రేటింగ్‌లో అక్రమాలు..!
అయ్యప్ప స్వామి మాలధారణ చేసే వారిపై కూడా విమర్శలు చేసాడు. దీనితో ఫాలోవర్స్ సంఖ్య భారీగా పడిపోవడం గమనార్హం. భారత్ గురించి మాట్లాడుతూ.. అత్యాచారాలు, కాలుష్యం, తన కూతుర్ని ఇబ్బంది పెడతారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. దీనితో ఒక్కసారిగా హిందుత్వ వాదులు, దేశ భక్తులు ఫైర్ అయ్యారు. అటు సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా.. తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలువురు అతనిని అన్ ఫాలో చెయ్యాలని కోరుతూ పోస్ట్ లు వైరల్ చేస్తున్నారు. అతను క్షమాపణ చెప్పినప్పటికీ ఈ వివాదం మాత్రం చల్లారేలా కనపడటం లేదనే చెప్పాలి.

