ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో కాస్త రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఇదే సమయంలో నేరాలు చేసిన వాళ్ల పరిస్థితి కూడా కాస్త భిన్నమే. ముఖ్యంగా హత్య నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొనే వారికి సంబంధించి కాస్త ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో కీలక కేసుల్లో కీలకంగా భావిస్తున్నటువంటి నిందితులు కూడా ప్రాణాలు కోల్పోవడం గత కొన్నాళ్లుగా సంచలనం అవుతుంది. కొన్ని కేసుల్లో నిందితులు ఒక్కొక్కరిగా పదేపదే ఏదో ఒక రూపంలో ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యం కలిగించే అంశం.
Also Read : మాగంటి కోట కూలింది.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ భారీ ఆధిక్యం..!
టిడిపి నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో సాక్షులతో పాటుగా, నిందితులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో రెండవ నిందితుడుగా ఉన్న మొద్దు శీను 2008 నవంబర్ 9న అనంతపురం జిల్లా జైల్లో హతమయ్యారు. 2011 జనవరి 3న మద్దెల చెరువు సూరిని హైదరాబాద్ యూసఫ్ గూడలో.. అతని అత్యంత సన్నిహితుడు హతమార్చాడు. పరిటాల రవి హత్యకు ఆయుధాలు సమకూర్చిన, అలాగే ప్రత్యక్షంగా కాల్పుల్లో పాల్గొన్న అజీజ్ రెడ్డి.. 2008 మే 1న ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. మొద్దు శీను ను చంపిన ఓం ప్రకాష్ జగన్ ప్రభుత్వంలో.. అనారోగ్యంతో మరణించడం అప్పట్లో సంచలనం.
ఇక పరకామణి అంశానికి సంబంధించి తాజాగా కీలక నిందితుడు.. సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా కొంతమంది కీలక నిందితులు, సాక్షులుగా భావిస్తున్న వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న కటికి రెడ్డి శ్రీనివాసుల రెడ్డి 2019 సెప్టెంబర్ లో విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివేకానంద రెడ్డి అంత్యక్రియలకు జగన్, వైయస్ భారతిని హైదరాబాదు నుంచి పులివెందులకు తీసుకొచ్చిన వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబర్లో అనారోగ్యంతో మృతి చెందాడు.
Also Read : బ్రేకింగ్: పరకామణి కేసులో కీలక నిందితుడు అనుమానాస్పద మృతి
వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రధాన సాక్ష్యంలో కల్లూరు గంగాధర్ రెడ్డి 2022 జూన్ లో అనారోగ్యంతో మృతిచెందగా.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకానంద రెడ్డి ఇంటి వద్ద కాపలాగా ఉన్న వాచ్మెన్ బి రంగన్న అనారోగ్యంతో ప్రాణాలకు కోల్పోయాడు. గంగాధర్ రెడ్డి.. తనకు వివేకానంద రెడ్డిని హత్య చేస్తే 10 కోట్లు ఇస్తానని అవినాష్ రెడ్డి చెప్పాడు అనే విషయాన్ని సిబిఐ అధికారుల ముందు బయటపెట్టిన తర్వాత కొన్ని రోజులకే ప్రాణాలు కోల్పోయాడు. వివేకానంద రెడ్డి ది దారుణమైన హత్య అంటూ ముందు చెప్పిన వైయస్ అభిషేక్ రెడ్డి 30 ఏళ్లకే తీవ్రమైన అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అలాగే వివేకానంద రెడ్డి మృతదేహానికి కట్లు కట్టిన జగన్ మామ గంగిరెడ్డి కూడా సడన్ గా ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో శవం వద్ద రక్తపు మరకలు ఉండటం అనేక అనుమానాలకు దారితీసింది.

