ప్రశాంతంగా ఉండే బెజవాడ నగరంలో ఒక్కసారిగా మావోయిస్టులు కలకలం సృష్టించారు. ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున గ్రేహౌండ్స్ దళాలు, ఆక్టోపస్, స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున మావోయిస్టుల ఉనికి గురించి సమాచారం అందుకొని.. సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టగా.. 27 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఇక అక్కడి నుంచి వస్తున్న సమాచారం విజయవాడ నగర వాసులతో పాటుగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కలవరపెడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఏఓబిలో మాత్రమే.. మావోయిస్టుల కదలికలు అప్పుడప్పుడు కనపడుతూ వచ్చాయి.
Also Read : మళ్ళీ కెప్టెన్ గా రోహిత్..? గిల్ కష్టమే..?
ఇక ఇప్పుడు పెద్ద ఎత్తున కానూరు సమీపంలో మావోయిస్టులు తిష్ట వేయడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే 27 మంది మావోయిస్టుల్లో.. హిడ్మా టీమ్ తో పాటుగా ఎన్కౌంటర్లో మరణించిన నంబాల కేశవరావు సెక్యూరిటీ చూసిన మావోయిస్టులు ఉన్నట్లు గుర్తించారు. 9 మంది నంబాల బాడీగార్డులని విజయవాడ పోలీసులు వెల్లడించారు. ఓ అగ్ర నేతను హతమార్చేందుకు వీరు రెక్కీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇందుకోసం కొత్త ఆటోనగర్ లో పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా డంప్ చేసినట్లు వెల్లడైంది. కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి తర్వాత పెద్దగా విజయవాడలో మావోయిస్టుల కదలికలు కనపడలేదు.
Also Read : మాడ్వీ హిడ్మా.. వైలేంట్ హిస్టరీ.. సిఎం అభ్యర్ధినే లేపేసిన చరిత్ర..!
ఇక తాజాగా అరెస్టు చేసిన మావోయిస్టులు అందరూ చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. పది రోజుల క్రితమే మావోయిస్టులు విజయవాడ చేరుకున్నారని.. దాదాపు రెండు నెలల నుంచి విదేశాల్లో ఉంటున్న.. ఓ వ్యక్తికి చెందిన భవనాన్ని వారు అద్దెకి తీసుకున్నారని.. పనుల కోసం విజయవాడ వచ్చామని, అక్కడి వాచ్మెన్ ను బలవంతం చేసి.. ఇంట్లో అద్దెకు దిగినట్లు గుర్తించారు. మొత్తం మూడు అంతస్తుల భవనంలో 27 మంది మావోయిస్టులు ఉన్నట్లుగా తేల్చారు. ఇక విజయవాడకు అతి దగ్గరలో ఉండే ఏలూరులో కూడా 12 మంది మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇక తాజాగా మావోయిస్టులు దాచిపెట్టిన డంప్ కూడా పోలీసులు తరలించారు.
Also Read : భారత్ లో హమాస్ తరహా దాడులకు ప్లాన్..?
అందులో పేలుడు పదార్థాలతో పాటుగా పెద్ద ఎత్తున తుపాకులు కూడా ఉన్నట్లు వెల్లడైంది. వీరిని ప్రస్తుత మావోయిస్టు అగ్ర నేత తిప్పిరి తిరుపతి టీం గా చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలను మళ్లీ విస్తరించేందుకు వాళ్లు అడుగుపెట్టి ఉండవచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 2006 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా మావోయిస్టుల ఉనికి తగ్గుముఖం పడుతూ వచ్చింది. నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసుల నిర్బంధం పెరిగిపోవడం.. స్థానిక ప్రజల నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో మావోయిస్టులు దండకారణ్యం వైపు వెళ్లిపోయారు. ఇక అప్పటినుంచి చత్తీస్గడ్ కేంద్రంగానే మావోయిస్టులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడే కొంతమంది మావోయిస్టులు కూడా విజయవాడ చేరుకుని కొన్ని ఆసుపత్రులలో చికిత్స చేయించుకుంటున్నట్లు కూడా వెల్లడైంది.

