రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మే 9న జరిగే వేడుకలకు హాజరు కావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మాస్కో ఆహ్వానించినట్లు రష్యా విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ రుడెంకో మంగళవారం ఓ కీలక ప్రకటన చేసారు. మోడీకి ఇప్పటికే ఆహ్వానం అందించామని ఈ కార్యక్రమానికి వచ్చే నెలలో ఆయన రష్యాలో ఉంటారని రుడెంకో వెల్లడించారు. ఈ సంవత్సరం మాస్కోలోని ఐకానిక్ రెడ్ స్క్వేర్‌లో జరిగే విక్టరీ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల నేతలకు ఆహ్వానం పలికారు.
Also Read : జగన్‌కు పోలీసు దెబ్బ రుచి తప్పదా..!
ప్రధాని మోదీతో పాటు, రష్యా తమతో స్నేహంగా ఉండే పలు దేశాల నాయకులను కూడా రష్యా ఆహ్వానించింది. ఈ ఏడాది చివర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా దేశానికి వచ్చే అవకాశం ఉన్నందున ఈ ఆహ్వానం కీలకంగా మారింది. 2024 జూలైలో రష్యా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ పుతిన్‌ను భారతదేశానికి రావాలని ఆహ్వానించారు. దానికి పుతిన్ అంగీకారం తెలిపారు. పర్యటనకు సంబంధించిన తేదీలు ఇంకా ప్రకటించలేదు.
Also Read : వైసీపీకి జీవం పోస్తున్న టీడీపీ నేతలు.. ఇలా అయితే ఎలా..?
మోడీ రష్యా పర్యటనపై త్వరలో అధికారిక ప్రకటన చేయనున్న విదేశాంగ శాఖ.. తేదీలను కూడా ఖరారు చేయనుంది. 5 ఏళ్ళ తర్వాత గత ఏడాది ప్రధాని రష్యా వెళ్ళారు. ఇదిలా ఉంచితే ఉక్రెయిన్, రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో భారత్ కీలక పాత్ర పోషించింది. రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న నేపధ్యంలో.. మోడీ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మోడీ రష్యా పర్యటన నేపధ్యంలో ఏమైనా కీలక ప్రకటనలు ఉండబోతున్నాయా అనేది ఆసక్తికరంగా మారింది.

