దేశంలో ఉపాధి కార్యక్రమాలను బలోపేతం చేసే విషయంలో కేంద్ర సర్కార్ చాలా జాగ్రత్తగా, పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. యువత కోసం ఈ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యెర్ర కోట నుంచి ప్రసంగించిన మోడీ.. ప్రధానమంత్రి విక్షిత్ భారత్ రోజ్‌గార్ యోజన కార్యక్రమాన్ని లక్ష కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇది దేశ యువతకు తాను ఇస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా మోడీ పేర్కొన్నారు.
Also Read : వన్డే కెప్టెన్ గా అతనే.. రోహిత్ కు షాక్ తప్పదా..?
ఈ కార్యక్రమం ఆగస్టు 15 నుండి అమల్లోకి వస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం పొందిన నిరుద్యోగులకు కేంద్రం నుండి రూ. 15,000 అందిస్తారు. ప్రైవేట్ రంగంలో నియామకాలను పెంచే ఉద్దేశంలో భాగంగా ఈ కార్యక్రమానికి అడుగులు వేసింది కేంద్ర సర్కార్. ఈ కార్యక్రమం దాదాపు 3.5 కోట్ల మంది యువతకు సహాయపడుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే భారత యువత ఆశయానికి మద్దతు ఇవ్వడంలో ఈ కార్యక్రమం కీలకమైన అడుగుగా మోడీ అభివర్నిన్న్చారు.
Also Read : కూలీ డామినేషన్.. మరీ ఈ రేంజ్ లోనా..?
ఉపాధి ఆధారిత ప్రోత్సాహకంగా ప్రకటించిన ఈ కార్యక్రమం ఆగస్టు 2025 నుండి జూలై 2027 వరకు రెండు సంవత్సరాలలో దేశంలోని 3.5 కోట్ల మందికి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని కేంద్రం భావిస్తోంది. ఈ పథకంలో ముందు 1.92 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించడాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఈ ఏడాది చివరి నాటికి మేడ్-ఇన్-ఇండియా సెమీకండక్టర్ చిప్స్ మార్కెట్లో అందుబాటులోకి వస్తాయని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది భారతదేశ సాంకేతిక ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిగా అభివర్ణించారు.