Sunday, March 22, 2026 04:11 PM
Sunday, March 22, 2026 04:11 PM

బలగాలకు పూర్తి స్వేచ్చ.. ప్రధాని కీలక ప్రకటన

గత వారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలోనే ఉగ్రవాద స్థావరాలపై నిఘా వర్గాలు, భద్రతా బలగాలు ఫోకస్ పెట్టాయి. గత వారం జరిగిన దాడిలో 26 మంది పౌరులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపధ్యంలో కేంద్ర హోం, రక్షణ శాఖలు భద్రత విషయంలో కఠిన చర్యలకు రంగం సిద్దం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Also Read : మీ మంత్రే చెప్పాడు.. పాక్ పరువు తీసిన భారత్

ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని కీలక నిర్ణయం తీసుకున్నారు. భద్రతా బలగాలకు కేంద్రం పూర్తి స్వేచ్చ ఇస్తుందని, ఉగ్రవాద నిర్మూలనకు ఏ విధమైన చర్యలు అయినా చేపట్టేందుకు అధికారులు ఇస్తున్నామని కేంద్రం ప్రకటించింది. 90 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ముగ్గురు సర్వీసుల అధిపతులు – ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు.

Also Read : కాశ్మీర్ లో టూరిస్ట్ ప్లేస్ లు క్లోజ్.. భారీగా బలగాల మోహరింపు

భారత సాయుధ దళాల సామర్థ్యాలపై ఆయన పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై మన పోరాటంలో 140 కోట్ల మంది భారతీయులకు ప్రపంచం మొత్తం అండగా నిలుస్తుంది. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని, న్యాయం జరుగుతుందని నేను మరోసారి హామీ ఇస్తున్నాను అంటూ ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని వ్యాఖ్యానించారు. అటు పాకిస్తాన్ విషయంలో కూడా కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలు దౌత్య పరమైన నిర్ణయాలను కేంద్రం అమలు చేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్