Sunday, March 22, 2026 04:10 PM
Sunday, March 22, 2026 04:10 PM

పోలవరంపై తొలిసారి రంగంలోకి మోడీ

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఉన్న నేపధ్యంలో పనులు క్రమంగా వేగవంతం అవుతున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పురోగతిపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈనెల 28వ తేదీన మధ్యాహం మూడున్నర గంటలకు ఆంధ్ర, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటుగా ఒడిసా, ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రులు మోహన్ చరణ్, విష్ణుదేవ్ సాయి, ఆయా రాష్ట్రాల జల వనరుల మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు.

Also Read : టీడీపీ రూట్ మ్యాప్.. మహానాడులో అన్నీ సంచలనాలే

ఈ సమాచారాన్ని ప్రధాని కార్యాలయం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపింది. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం పాజెక్టుకు కేంద్రం జాతీయహోదా కల్పించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రాజెక్ట నిర్మాణ బాధ్యత రాష్ట్రానికే అప్పగించాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. దీనికి కేంద్ర జలశక్తి శాఖ సానుకూలంగా స్పందించి అనుమతి ఇచ్చింది. నిర్మాణ బాధ్యతలను 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షిస్తోంది. 2014-19 నడుమ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి సోమవారాన్ని పోల’వారం’గా మార్చి సమీక్షలు నిర్వహించి, ప్రధాన డ్యాం పనులు 72 శాతం వరకు పూర్తి చేయించారు.

Also Read : ప్రభుత్వం కూలుతుందా..? సైలెంట్‌గా కాంగ్రెస్..?

అప్పట్లో డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తిచేశారు. దానిపై ఎర్త్ కమ్ రాక్ఫెల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం వేసేస్తే, ప్రాజెక్టు ప్రధాన డ్యాం పనులు పూర్తి అయ్యేవి. అయితే పోలవరం ప్రాజెక్ట్ పనులు 2019 నుంచి వెనుకబడిన సంగతి తెలిసిందే. ఇక గత ఏడాది ఎన్డియే అధికారంలోకి రావడంతో.. మళ్ళీ పోలవరం పనులకు మోక్షం లభించింది. ఇక కేంద్రం కూడా నిధులను భారీగా కేటాయించడంతో.. పనులను వేగవంతం చేసారు. దెబ్బ తిన్న కొన్ని పనులను కూడా తిరిగి పూర్తి చేసేందుకు శంకుస్థాపనలు కూడా చేసారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షా సమావేశం నిర్వహించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్