Thursday, February 5, 2026 12:34 AM
Thursday, February 5, 2026 12:34 AM

మిర్చి బస్తాల చోరీ.. మరీ ఇంత నీచమా..!

వైసీపీ నేతల గురించి సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇంతకు ఏ విషయం గురించో తెలుసా… దొంగతనం గురించే. అవును వైసీపీ నేతలు అధికారం కోల్పోయిన బాధలో… అవకాశం ఉన్న ప్రతిచోటా అడ్డంగా దోచేస్తున్నారు. ఐదేళ్ల పాటు ఇష్టానుసారం వ్యవహరించిన వైసీపీ మూకలు.. అధికారం కోల్పోయిన తర్వాత.. చివరికి దొంగలుగా మారిపోయారు. యధా రాజా.. తథా ప్రజా అన్నట్లుగా… తమ నేతలు అనుసరించిన బాటలో కార్యకర్తలు కూడా నడుస్తున్నారు.

Also Read : బాలీవుడ్ గోల్డెన్ లెగ్ రష్మిక

గుంటూరు మిర్చి యార్డులో రైతులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. అంత వరకు బాగానే ఉంది. వచ్చారు.. చూశారు.. నాలుగు మాటలు చెప్పారు.. పోయారు.. ఇదంతా పైకి కనిపించే విషయం. అయితే ఈ పరామర్శ ముసుగులో కొందరు వైసీపీ కార్యకర్తలు తమ చేతులకు పని చెప్పారు. వైఎస్ జగన్ వచ్చిన సమయంలో ఏకంగా 14 మిర్చి బస్తాలను ఎత్తుకెళ్లారు. తోపులాట ముసుగులో..‌ రైతులను దూరంగా నెట్టేసి..‌ బస్తాలను ఎత్తుకెళ్లినట్లు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

Also Read : జగన్ గాలి తీస్తున్న పాత జీవో

మిర్చి యార్డులో బస్తాలను రైతులు వరుసగా నెట్ కట్టడం ఆనవాయితీ. అలా పేర్చిన నెట్ పక్కనే కాపలాగా ఉంటారు. రెండు రోజుల క్రితం గుంటూరు మిర్చి యార్డుకు పల్నాడు ప్రాంతానికి చెందిన నారాయణ, వెంకట సుబ్బయ్య అనే ఇద్దరు రైతులు మిర్చి బస్తాలను తీసుకొచ్చి.. నెట్ కట్టారు. అయితే ఆ నెట్ సమీపంలోకి జగన్ రాగానే.. తోపులాట జరిగింది. దీంతో ఇద్దరు రైతులు కాస్త దూరంగా వెళ్లారు. జగన్ వెళ్లిన తర్వాత తమ నెట్ దగ్గరికి వచ్చిన రైతులు.. 14 బస్తాలు తగ్గినట్లు గుర్తించారు. వెంటనే యార్డు అధికారులకు ఫిర్యాదు చేయగా… వాళ్లు సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేశారు. అందులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు చైతన్య తీసుకొచ్చిన ఇసుజు ట్రక్కులో మిర్చి టిక్కీలు తీసుకెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రైతులు మిర్చి టిక్కీల చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో లేళ్ల అప్పిరెడ్డి కూడా ఉన్నాడు. ఇప్పటికే అప్పిరెడ్డిపైన కావాల్సినన్ని ఆరోపణలు. అలాంటి నేతకు అనుచరుడు అంటే… ఆ మాత్రం ఉండదా అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఓ వైపు బస్తాలు దొంగతనం చేస్తూ..‌ మరోవైపు పరామర్శించడం.. మీ వైసీపీ నేతలకు మాత్రమే చెల్లింది అంటూ పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తున్నారు కూడా.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్