Sunday, March 22, 2026 07:27 AM
Sunday, March 22, 2026 07:27 AM

జగన్, కేటీఆర్ కలయిక.. వారికి పండగే..!

అన్న.. అరెస్టు చేస్తే ఏం చేయాలి.. జైలులో ఉన్నప్పుడు రోజూ ములాఖత్‌లు ఎలా సాధ్యం.. బెయిల్ త్వరగా తెచ్చుకుంటే మంచిదా.. లేక.. ఓ రెండు నెలలు లోపలుంటే బెటరంటావా.. అలా లోపలికి పోయిన తర్వాత మనం ఏం చేయాలి.. ఇవే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న ప్రశ్నలు. నిజానికి ఈ ప్రశ్నల వెనుక ఓ పెద్ద కథే ఉంది. ఇవన్నీ నిజానికి కల్పితాలే.. కానీ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఓ ఫోటో పెట్టి.. కింద మాత్రం ఓ ప్రశ్న అడుగుతున్నారు.. మీ అన్నను ఇదే అడిగావా అన్నా.. అని సెటైర్లు వేస్తున్నారు.

Also Read : వెటరన్ స్టార్ హీరో ధర్మేంద్ర కన్నుమూత.. జీవిత విశేషాలు ఇవే

రెండు రోజుల క్రితం బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు పాల్గొన్నారు. ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. నవ్వుకున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. రెండు పార్టీల నేతలు కలవటం పెద్ద విచిత్రం కాదు.. కానీ జగన్, కేటీఆర్ కలవటం పైనే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

గుర్రాల రేసింగ్స్‌కు సంబంధించిన ఈక్వెస్ట్రియన్ స్పోర్ట్స్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొన్నారు. సాధారాణంగా బాగా డబ్బున్న వాళ్లు మాత్రమే గుర్రాల రేసింగ్ క్లబ్‌ల్లో పాల్గొంటారు. ఇలాంటి కార్యక్రమంలో ఈ ఇద్దరు పాల్గొన్నారు. ఇక ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో కేటీఆర్ అరెస్టు ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో జగన్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు.

13 ఏళ్ల క్రితం అక్రమాస్తుల కేసులో అరెస్టైన జగన్.. ఏకంగా 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఇక 12 ఏళ్లుగా బెయిల్‌కపైన బయట తిరుగుతున్న ఏకైక వ్యక్తి కూడా జగన్ కావడం విశేషం. ఇది ఎలా సాధ్యమనేది ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కటం లేదు. ఇక ఫార్మూలా ఈ కార్ రేసు కేసులో అరెస్టు అయితే.. నేనేం చేయాలని జగన్‌ను కేటీఆర్ సలహా అడిగారంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ ఇద్దరి కలయికపై ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ నవ్వు తెప్పిస్తున్నాయి కూడా. ఇన్నేళ్లు బెయిల్ మీద ఉండటం ఎలా సాధ్యమైంది అన్న.. అని కేటీఆర్ అడిగితే.. అంతా న్యాయ దేవత మహిమ.. ఆమెకు కనిపించదు కదా.. అందుకే నేను తప్పించుకుంటున్నా… అని జగన్ చెప్పినట్లు మిమ్స్ పోస్ట్ చేస్తున్నారు.

Also Read : కర్ణాటక సీఎం కుర్చీ.. మల్లికార్జున ఖర్గే సీరియస్..

న్యాయవ్యవస్థను ఎలా మేనేజ్ చేయాలి? బెయిల్ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? డిశ్చార్జి పిటిషన్లు వేసి అసలు పిటిషన్లు విచారణకు రాకుండా ఉండటానికి రచించాల్సిన వ్యూహాలను, ఎవరు ఎలాంటి కేసుల్లో తీర్పులిచ్చారు? అనే విషయాలపై జగన్ దగ్గర కేటీఆర్ న్యాయ సలహాలు తీసుకున్నారనేది సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల మాట. ఇక మరికొందరైతే.. అప్పుడంటే నీకు మీ తల్లి, చెల్లి అండగా ఉన్నారు.. మీ చెల్లి నీ కోసం పాదయాత్ర కూడా చేశారు.. కానీ.. నాకు పెద్ద శత్రువు మా చెల్లెలే.. మరోవైపు నేను అరెస్టు అయితే.. మా బావ హరిశ్ రావు వెంటనే వచ్చి పార్టీ ఆఫీసులో నా కుర్చీలో కూర్చుంటాడు.. అప్పుడు నా గతేంటి.. అని కేటీఆర్ అన్నట్లు పోస్టులు చేస్తున్నారు. మొత్తానికి జగన్, కేటీఆర్ కలయిక పొలిటికల్ సర్కిల్‌లో దుమారం రేపుతుంటే.. మీమర్స్ మాత్రం బాగా ట్రోల్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్