2026 సంక్రాంతికి విడుదలైన 5 సినిమాలలో, మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా మాత్రం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సంక్రాంతికి పండుగకు రిలీజ్ అయిన నారీ నారీ నడుమ మురారీ, అనగనగా ఒక రాజు సినిమాలు మంచి పాజిటివ్ టాక్‌తో నడుస్తున్నాయి. ప్రభాస్ హీరోగా వచ్చిన రాజాసాబ్ సినిమా హర్రర్ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక రవితేజ హీరోగా వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం.. ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది.
Also Read : సంచలన నిర్ణయం దిశగా జగన్ అడుగులు..!
సెలవు సీజన్‌లో మంచి ఓపెనింగ్స్ సాధించిన మన శంకర వర ప్రసాద్ గారు.. 300 కోట్ల మార్క్ దాటినట్లు చిత్ర యూనిట్ వీడియో కూడా విడుదల చేసింది. చిత్రం బంపర్ హిట్ అని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలు కూడా చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమా పూర్తిస్థాయి గణాంకాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో చిరంజీవి తిరిగి ట్రాక్‌లోకి వచ్చాడనే మాట బాగా వినిపిస్తోంది.
సంక్రాంతి రేసులో చిరు టాప్‌లో నిలవటంతో అందరి దృష్టి ఇప్పుడు విశ్వంభరపై పడింది. నిజానికి విశ్వంభర నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే.. ఇది థియేటర్లలోకి ఎప్పుడు వస్తుంది.? అనే ప్రశ్న మెగా అభిమానులు వేస్తున్నారు. దీని అధిక బడ్జెట్, ఆలస్యం కారణంగా వచ్చిన వడ్డీని పరిగణనలోకి తీసుకుంటే, ఈ సినిమా సెలవుల సమయంలో విడుదలైతేనే దాని పెట్టుబడిని తిరిగి పొందగలిగే అవకాశం ఉంది. అంటే వేసవి సెలవులు మాత్రమే అనేది సినీ వర్గాల మాట.
Also Read : కవిత–పీకే భేటీ: తెలంగాణ రాజకీయాల్లో నూతన శకం
విశ్వంభర ప్రధానంగా కుటుంబ ప్రేక్షకులను, పిల్లలను లక్ష్యంగా తీసిన సినిమా అని దర్శక, నిర్మాతలు ఇప్పటికే తెలిపారు. ఈ స్థాయి చిత్రానికి, బలమైన ఓపెనింగ్స్ రావాలంటే కనీసం కనీసం ఐదు నుండి ఆరు రోజుల సెలవులు అవసరం. కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో థియేటర్‌లకు వచ్చేది వేసవిలో మాత్రమే. ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ అతిపెద్ద సవాలుగా మిగిలిపోయాయి. రిలీజ్ ఆలస్యమవ్వడానికి కూడా ఇదే కారణం. నాన్-థియేట్రికల్ డీల్స్‌ను ఖరారు చేయడంలో కూడా నిర్మాతలు అడ్డంకులను ఎదుర్కొన్నట్లు సమాచారం. అయితే, చిరంజీవి పునరుద్ధరించిన బాక్సాఫీస్ రూపంతో, ఈ చిత్రం ఇప్పుడుక ఓటీటీ, ఇతర డిజిటల్ హక్కులకు కూడా మెరుగైన రేట్లను పొందే అవకాశం ఉంది.

