Sunday, March 22, 2026 04:17 AM
Sunday, March 22, 2026 04:17 AM

బాలకృష్ణ పై ఎందుకీ ఏడుపు…? ఒక్కటైన మెగా ఫ్యాన్స్, వైసీపీ..?

సాధారణంగా సినిమాల్లో ఫిజిక్స్ గురించి మాట్లాడటం కామెడీగా ఉంటుంది. ఎలివేషన్, యాక్షన్ సీన్లు వంటివి ఈ రోజుల్లో సినిమాలను డామినేట్ చేస్తున్నాయి. మాస్ హీరోల నుంచి అభిమానులు ఎక్కువగా వీటిని కోరుకుంటూ ఉంటారు. దీనితో దర్శకులు కూడా వాటిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు. హాలీవుడ్ సినిమాల్లో కూడా యాక్షన్ సీన్లకు ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది. మన తెలుగులో సహా సౌత్ ఇండియా సినిమాలో యాక్షన్ సీన్లకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇదే సమయంలో ఎలివేషన్స్ సీన్లకు కూడా ప్రయారిటీ ఎక్కువగా ఇస్తూ ఉంటారు డైరెక్టర్లు.

Also Read : అఖండ 2 మూవీ రివ్యూ : నిజంగా అఖండ తాండవమే

ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఈ తరహా సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిల్లో లోపాలు వెతకడం మొదలుపెట్టారు కొందరు సినిమా విమర్శకులు. వేరే ఏ ఇతర సినిమాల్లోనూ వెతకని లోపాలను బాలయ్య సినిమాల్లో వెతకడం.. వాటి గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అఖండ సీక్వెల్ లో కొన్ని లోపాలు వెతికి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమా విమర్శకులు. కానీ గతంలో వచ్చిన పుష్ప, ఆచార్య, సహా అనేక సినిమాల్లో ఉన్న సన్నివేశాల గురించి మాట కూడా మాట్లాడలేదు ఈ విమర్శకులు.

Also Read : లోకేష్ కమిట్మెంట్ కు షాక్ అయిన టీడీపీ నేతలు

సినిమాకు పాజిటివ్ టాక్ రాగా.. రివ్యూల పేరుతో వైసీపీకి అనుకూలంగా ఉండే ఓ సామాజిక వర్గ కార్యకర్తలు.. సోషల్ మీడియాలో సినిమాను ట్రోల్ చేస్తూ పోస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నార్త్ ఇండియా లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాపై.. ఇక్కడ విమర్శకులు కామెంట్స్ చేయడం విడ్డూరంగా ఉందంటున్నారు టాలీవుడ్ జనాలు. ముందు నుంచి బాలకృష్ణ విషయంలో ఏదో ఒక విమర్శ చేస్తూ వచ్చే వైసీపీ, మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఒక్కటై అఖండ సినిమాపై విమర్శలు మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను ట్రోల్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పవన్ సినిమాలకు బాలకృష్ణ ఓరకంగా ప్రమోషన్ చేసిన సరే పవన్ ఫ్యాన్స్ మాత్రం అఖండ సినిమాపై విమర్శలు చేయడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్