నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్విస్ స్కీ రిసార్ట్ బార్‌లో చెలరేగిన అగ్ని కీలలు షాంపైన్ బాటిళ్లకు అమర్చిన స్పార్కర్ల వల్ల సంభవించి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. “షాంపైన్ బాటిళ్లకు కొవ్వొత్తులు లేదా ‘బెంగాల్ లైట్ల’ నుండి మంటలు అంటుకోవటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. మంటలు వేగంగా వ్యాప్తి చెందేందుకు పైన ఏర్పాటు చేసిన క్లాత్ డెకరేషన్ కూడా కారణమన్నారు. మంటలు పైకప్పుకు అంటుకున్న వెంటనే.. విస్తృతంగా చెలరేగాయని దర్యాప్తు అధికారులు తెలిపారు.
Also Read : బాక్సాఫీస్ ను దున్నేస్తున్న దురంధర్.. నాలుగో వారం కూడా..!
న్యూ ఈయర్ వేడుకలు జరుగుతున్న సమయంలో తెల్లవారుజామున స్విస్ ఆల్ప్స్ పట్టణంలోని క్రాన్స్-మోంటానాలోని రద్దీగా ఉండే లే బార్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 40 మంది మరణించారు. మరో 119 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంటల్లో కాలు బూడిదైన మృతదేహాల గుర్తింపు కష్టంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారు చాలామంది ఇప్పటికీ తప్పిపోయిన స్నేహితులు, బంధువుల సమాచారం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
ప్రమాదం జరిగిన తీరుపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగారు. గాయపడిన 119 మందిలో ఇప్పటికే 113 మందిని గుర్తించి.. వారి బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. గాయపడిన వారిలో 14 మంది ఫ్రెంచ్ జాతీయులు, 11 మంది ఇటాలియన్లు, నలుగురు సెర్బియన్‌లు ఉన్నారని పోలీసులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న 50 మందిని ఇతర యూరోపియన్ దేశాలకు పంపినట్లు అధికారులు తెలిపారు.
Also Read : ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థాయిలో కొత్త స్టేడియాలు..!
ఇటలీలోని మిలన్కు చెందిన 20 మంది స్నేహితులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం స్విస్ వచ్చారు. వాళ్లంతా ఈ ప్రమాదంలో చనిపోయినట్లు మార్కో అనే మరో స్నేహితుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. చాలా మృతదేహాలు బాగా కాలిపోయినందున బాధితుల పేర్లు చెప్పడానికి లేదా మరణాల సంఖ్యను ఖచ్చితంగా నిర్ణయించడానికి సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. దంత, DNA నమూనాల ద్వారా బాధితులను గుర్తిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బార్‌లో పరిమితికి మించి జనం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రమాదం అనంతరం బార్ యజమాని పరారైనట్లు పోలీసులు గుర్తించారు.
డిసెంబర్ 6వ తేదీ గోవాలోని ఓ నైట్ క్లబ్‌లో కూడా ఇదే తరహాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న ‘బిర్చ్ బై రోమియో లేన్’లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ క్లబ్‌ను ఉప్పునీటి కయ్యపై చట్టవిరుద్ధంగా నిర్మించినట్లు విచారణలో తేలింది.

